పసుపు అనేది ప్రతి వంటింట్లో వాడుకలో ఉండేది. అయితే పసుపు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని ఆహార నియమాలను కఠినంగా పాటించాలి. అప్పుడే శరీరం మనకు అనుకూలిస్తుంది. కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పసుపు అనేది సాధారణంగా ఉపయోగించే మసాలా. ఇది ఆహారానికి రంగు, రుచిని జోడించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి భారతీయ వంటకాల్లో పసుపును కలుపుతారు. అంతేకాదు పసుపు రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
పసుపుతో టీ తయారు చేసి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గించడంతోపాటు బిసిటీతో పోరాడడానికి పసుపు టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది అధిక బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అధిక బరువును తగ్గించడంలో పసుపు టీ దోహదం చేస్తుంది. దీంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
నాలుగు కప్పుల నీటిని వేడి చేసి అందులో రెండు స్పూన్ల పసుపు పొడిని వేయాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత దానిని గిన్నెలోకి తీసుకుని ఐదు నిమిషాల పాటు చల్లార్చనివ్వాలి. ఆపై అల్లం ముక్క, కొద్దిగా తేనె కూడా కపుపుకోవచ్చు. తయారు చేసేని టీని రోజు తాగితే ఆరోగ్యం మెరగవుతుందని వైద్య నిపుణులు చెబున్నారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మమ్మిల్ని రోజంతా ఉత్తేజంగా ఉంచుతుంది. పసుపు టీ తాగడం రుచికరమైనదే కాకుండా అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
అలాగే పసుపు టీ తాగడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. పసుపులో ఉండే ప్రత్యేక పదార్థం కంటి రెటీనాను రక్షిస్తుంది. ఇది దృష్టి లోపాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో ఉండే కర్కుమిన్, కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండెపోటును కూడా నివారిస్తుంది. ఇక చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో పసుపు మించిన ఔషధం లేదంటున్నారు వైద్య నిపుణులు. పసుపు టీ క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం నిగారింపుగా మారుతుంది. పసుపు టీ బరువును నియంత్రించడంలో ఎంతో తోడ్పడుతుంది. అలాగే చండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నారు. పసుపు టీ మధుమేహానికి ఎంతో మంచిది. ఈ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరి తిత్తులకు పసుపు టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది.
శీతాకాలంలో పసుపు టీ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పసుపు క్యాన్సర్‌తో పోరాడే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పసుపులోని కుర్కమిన్ ట్యూమర్ల పెరుగుదలను అరికడుతుంది. క్యాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటుందని పరిశోధనలో వెల్లడైంది.