తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్
08 Aug 2022 తెలంగాణ 494

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్

 

ప్రభుత్వ పాఠశాల్లో సౌకర్యాల ఏర్పాటులో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి

 

 పుస్తకాలు లేవు, సరిపడా టీచర్లు లేరు, బడుల్లో మౌళిక వసుతులు లేవు... ట్విట్టర్ లో ఎంపీ రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్: 

 

శిథిల భవనాలు, చాలీచాలని తరగతి గదులు, సరిపడా లేని టీచర్లు, నాణ్యత లేని భోజనం, సౌకర్యాల లేమి, ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం..ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది 

 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు, సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘చదువుకునే చోటు లేదు..చదువుకునెందుకు పుస్తకం లేదు

చదువు చెప్పే గురువులు లేరు…పసి పిల్లల ప్రాణాలకు భరోసా లేదు..ఈ ఉద్యమ ద్రోహి పాలనలో..

పైలం బిడ్డో.. అని బడికి పంపే పరిస్థితి... కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు బడులపై కాంగ్రెస్ నజర్..’ అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.  అచ్చంపేట నియోజకవర్గం తాగపూర్ ప్రభుత్వ పాఠశాల ఉన్న దుస్థితిని వీడియో రూపంలో ట్విట్టర్ లో షేర్ చేసారు ఎంపీ రేవంత్ రెడ్డి. పెచ్చులూడిన గోడలు, తరగతి గదుల్లో సౌకర్యాల లేమి, కలుషిత తాగునీరు, పురుగులు పట్టిన అన్నం, అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను వీడియో ద్వారా వివరిస్తూ, ప్రభుత్వ పాఠశాలలపై సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గతంలో ఇచ్చిన హామీలను ట్విట్టర్ లో గుర్తు చేశారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ పుస్తకాలు రాకపోవడం, సరిపడా టీచర్లు లేకపోవడం వంటి విషయాలపై ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV