మరో వివాదంలో పుట్ట మధు.
04 Mar 2023 తెలంగాణ 403

సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీపీ పుట్ట మధు పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై చేసిన ఆరోపణలు ఆ ఎంపీపీ మాటల్లోనే...

 

రామగిరి మండలం ఎంపిపి ఐనా ఆరెల్లి దేవక్క - కొమురయ్య అను మాకు పుట్ట మధు , పుదారి సత్యనారాయణ నుండి ప్రాణ హాని ఉంది , వారి నుండి మమ్మల్ని కాపాడండి

 

శ్రీయుత గౌరవనీయులైన పెద్దపల్లి జిల్లా ప్రజలకి , మంథని నియోజకవర్గ ప్రజలకి ,నన్ను గెలిపించిన రామగిరి మండల ప్రజలకి పాదాభి వందనాలు .

 

నేను , నా భర్త బిఆర్ఎస్ పార్టీ లో గత పది హేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీర్ గారి , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ కోసం , ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాం .

మేము ఎంపీపీ అయ్యినప్పటి నుండి మమ్మల్ని ఇక్కడ ఓడిపోయినా ఎంపిటిసి పుదారి సత్యనారాయణ , మరియు ఇక్కడ నియోజక వర్గ ఇంచార్జి అనుచరులు నానా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తున్నారు ,  *ఇక్కడ నియోజక వర్గ ఇంచార్జి  పుట్ట మధు గారు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన  వైస్ ఎంపీపీ కి నా ఎంపీపీ కోసం పది లక్షలు ఇవ్వమన్నాడు , నాకు ఉన్న పొలం అమ్ముకొని మరి ఇంచార్జి పుట్ట మధు గారి ఆదేశాల ప్రకారం వారికి డబ్బులు ఇచ్చాను , అప్పటి నుండి ఇక్కడ ఓడిపోయినా ఎంపిటిసి పుదారి సత్యనారాయణ   మిగితా ఎంపిటిసి లను నా మీదకి ఉసిగొల్పి డబ్బులు ఇవ్వమని గొడవ పెట్టించాడు , నాతో బ్లాంక్ చెక్ ఇప్పించాడు , మేము ఎంపీపీ అయ్యినప్పటి నుండి మా మీద కక్ష కట్టి  మాకు ప్రజాసేవ చేయడానికి అధికారుల సహకారం లేకుండా చేసారు , ఇక్కడ రామగిరి మండలం మొత్తం తన అనుచరుడి  సత్యనారాయణ  గుప్పిట్లో పెట్టుకొని అధికారులను భయబ్రాంతులకు గురిచేసి మా మీదకి ఉసిగొల్పి మా కోసమే కొత్త కొత్త జిఓ లు అమలుచేశారు , మా పార్టీ లో ఉన్న మిగితా ఎంపిటిసి లతో వారికీ ఇష్టం లేకున్నా నా తోటి పార్టీ ఎంపిటిసి లు ఐనా వారిని బెదిరించి నా పై చెక్ బౌన్స్ కేసు వేశారు , మహిళా ఎంపీపీ అని చూడకుండా సోషల్ మీడియా లో , తన ఆస్థాన పత్రిక లో బూతు రాతలు , సొంత పార్టీ వల్లే ,మహిళలే తలదించుకునే రాతలు రాసారు . ఇంచార్జి ముందే మీ మీద భౌతిక దాడులకు కూడా ఉసిగొల్పారు ... ఇదే ఇంచార్జికి ఇంతక ముందు చెప్తే మాట్లాడుతా మాట్లాడుతా అంటాడు కానీ వాళ్ళను మా మీదకు ఏదో మనసులో పెట్టుకొని మమ్మల్ని మహిళా అని చూడకుండా , సొంత పార్టీ అని చూడకుండా కక్ష సాధింపులకి గురి చేస్తూనే ఉన్నారు .

 

*ఈ చెక్ బౌన్స్ కేసు  విషయం లో జడ్పీ ఆఫీస్ లో మాట్లాడుదాం అని పుట్ట మధు గారు పిలిచి ఒక మహిళా ఎంపీపీ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు ,ఎవరికి చెప్పుకోలేని బూతులు తిట్టాడు, నీకు కార్ ఎందుకే , ఇంకా మీరు ఫంక్షన్ లలో బట్టలు పెడుతారా , మీకే తినడానికి దిక్కు లేదు , ఇవ్వన్నీ ఎందుకే ??? ,అన్న మీరు కూడా ఇలా వాళ్ళ లాగ మాట్లాడుతారా , నీకు చెల్లలు లాంటి దాన్ని , అని బూతులు మాట్లాడుతారా ? మహిళా చైతన్యం అంటే ఇదేనా ? బహుజన వాదం అంటే ఇదేనా ? సొంత పార్టీ దాన్ని ఆడదాన్ని అని చూడకుండా మా పై కేసు వేసి జైలు కి పంపుతారా అన్న ?  ఆలా అంటే

మాకు  ఎదురు తిరిగితే వామన్ రావు కి పట్టిన గతే మీకు పడుతది , నా సొంత అల్లుడిని జైలు కి పంపిన , మీరు వాడికంటే గొప్పనా ? నాకు అడ్డువస్తే ఎవడికైనా అదే గతి పడుతది , చూసావా ఎలా నేను పుదారి సత్తి తప్పించుకున్నామో ,  పోలీస్ లు నావాళ్లు , నేను చెప్పినట్టు వింటారా ? నువ్వు చెప్తే వింటారా ? నేను అంటే ఏంటో ఎలక్షన్ లు కానీ ,అప్పుడు చెప్తా ఒక్కకడి  సంగతి  చెప్తా , పోనీ లే అని ఉరుకుంటే ఏదో అనుకుంటున్నారు , జైలు లో ఉన్న వాళ్ళు బయటకి రాని మళ్ళి పుట్ట మధు అంటే ఏంటో చూపిస్త , ఈ సారి శవాలు కూడా దొరుకవ్ అని ఇష్టం వచ్చినట్లు కోపం తో ఊగిపోయి తిట్టి , మీ దిక్కున్న చోటు చెప్పుకోండి , కేటిర్ ఏమి పీకలేడు, కేసీర్ ఏమి పీకలేడు అని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు ..నీ కొడుకు jntu నుండి జాబ్ పీకేస్తాం ,మాకు అడ్డువస్తే ఎలా కేసు ల్లో ఇరికించాలో, లారీ లతో తొక్కించడం  మాకు తెలుసు , నీకు తినడానికి తిండిలేకుండా చేస్తా అని బెదిరించి బయటకి గెంటి వేసాడు ,

 

మాకు, మా కుటుంబానికి  మంథని నియోజక వర్గ ఇంచార్జి పుట్ట మధు గారి కుటుంబం తో , నాగేపల్లి కి చెందిన పుదారి సత్య నారాయణా తో  ప్రాణహాని ఉంది , దయచేసి ప్రజలారా , నా తోటి పార్టీ నాయకుల్లారా , ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్  , కేటిఆర్  మమ్మల్ని పుట్ట మధు, పుదారి సత్య నారాయణా నుండి కాపాడాలని వేడుకుంటున్నాం అంటూ  రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క - కొమురయ్య లు పేర్కొన్నారు..

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV