మునుగోడు ఉప ఎన్నిక, రెడీ అవుతున్న ఉప ఎన్నికల శాఖ మంత్రి హరీష్ రావు
ధర్మపీఠం దద్దరిల్లినప్పుడల్లా... బలిపీఠం ఎక్కే ఒకే ఒక్కడు హరీష్ రావు. వైద్యారోగ్య-ఆర్థిక శాఖ మంత్రిగనే తెలంగాణ చూస్తున్నది గనీ... ఆ ట్రబుల్ షూటర్ కు ట్రబుల్ ఇచ్చే మరో శాఖ గూడుంది. అదే ఉప ఎన్నికల శాఖ. ఇపుడు మునుగోడు ఉప ఎన్నిక రాబోతున్నది కదా. ఎవరెవరు పోటీలో ఉంటరన్నది పక్కనపెడితే... టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు హరీష్ రావు భుజాల మీదే పెడతరన్నది తెలిసిందే.
తనకిష్టం లేకపోయినా సరే. ఇగ రావయా హరీష్... ఎప్పట్లాగే ఈ ఉప ఎన్నికను గూడ నువ్వే లీడ్ జెయ్యాలె అని మామ కేసీఆర్ నుంచి ఆదేశాలు తప్పకుండొస్తయ్. ఓకే మామా అని ఆయన గూడ మునుగోడు గడ్డ మీద గులాబీ జెండా అని పాటందుకుంటడు. ఖతం టీఆర్ఎస్ శ్రేణులంతా అభ్యర్థిని పక్కనపెట్టి హరీషన్నను ఫాలో అయితరు. అది వేరే విషయం.
హరీష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపు కారుదే అన్న ముద్ర ఉండేది. ఇపుడు కాదనుకోండి. గతంలో అది. తెలంగాణ రాకముందు. అదేంటో ఉప ఎన్నికల స్పెషలిస్ట్ కాస్త... ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది గత ఉప ఎన్నికల తర్వాత. 2006 నుండి తెలంగాణ లో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ పోటీ చేసే అభ్యర్థి కంటే ఎక్కువగా ప్రచారంలో ఉండేది హరీష్ రావే. అల్లుడు అడుగుపెడితే విజయం తథ్యం అని కేసీఆర్ సెంటిమెంట్ కూడా. కానీ దుబ్బాక నుండి మాత్రం ట్రబుల్ షూటర్ ట్రబుల్ లో పడ్డడు. దుబ్బాక పాయె, హుజూరాబాద్ పాయె. ఓడే చోట హరీష్ ని పెట్టి బలిపశువును చెయ్యడం, గెలిచే చోట తన వారసుడు కేటీఆర్ ని ముందు పెట్టి ప్రచారం చేయించడం కేసీఆర్ మార్క్ వ్యూహమైపోయింది.
ఇప్పుడు మునుగోడు లోనూ ఉప ఎన్నిక ఇంఛార్జిగా హరీష్ రావే వస్తడని టీఆరెఎస్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. 2006 , 2010, 2011, 2012లో జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ హరీష్ దే కీలక పాత్ర. కేసిఆర్ గజ్వేల్ లో రెండు సార్లు గెలవడానికి కూడా హరీష్ పాత్ర కీలమైందని అందరికీ తెలిసిన విషయమే. ఉద్యమ సమయంలో పరకాల ఉప ఎన్నిక, స్టేషన్ ఘనపూర్ బై పోల్, వరంగల్ వెస్ట్ ఉప ఎన్నిక ఇలా ప్రతి ఉప ఎన్నికలోనూ... హరీష్ దే కీలక పాత్ర. 2014 సాధారణ ఎన్నికల్లో కొడంగల్లో అడుగుపెట్టి రేవంత్ రెడ్డిని మట్టి కరిపించింది కూడా హరీషే. దాంతో ఆయన జైత్రయాత్ర అప్రతిహాసంగా సాగిపోయింది.
కానీ అధికారంలోకొచ్చినంక మాత్రం హరీష్ రావుకు అన్నీ ఎదురు తంతున్నై. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో అన్నీ తానై నడిపించారు హరీష్. కానీ ఈటల ధాటికి తేలిపోయారు. నిజానికి ఈటలతో పాటే గులాబీ ఓట్లన్నీ వెళ్లిపోయినా... 80 వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయంటే అదంతా హరీష్ కష్టమే. దుబ్బాక ఎన్నికల్లో బలహీన అభ్యర్థిని పెట్టినా టఫ్ ఫైట్ టీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇవ్వగలిగిందంటే.. దానికి కారణం హరీష్ రావే. కానీ ఎన్నిక ఏదైనా గెలుపే అంతిమం కాబట్టి హరీష్ రావు డీ ఫేమ్ అయిపోతున్నడు. నైతిక విజయానికి ప్రజాస్వామ్యంలో తావులేదు. సో మునుగోడు ఉప ఎన్నికలోనూ కేసీఆర్ బలి కా బక్రా హరీష్ రావేనా అన్నది తేలాలంటే... మరికొన్ని నెలలు ఆగాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.