Telangana Rythubandu Legal-Leaders Scam: Rs.13 Lakh Crore
16 Aug 2022 తెలంగాణ 543

హాయ్ నమస్తే. వెల్ కమ్ టు కాళోజీ టీవీ. నేను మీ కేవీఆర్. దేశభక్తి హ్యాంగోవర్ దిగిందా ? దిగితే కొన్ని నిజాలు మాట్లాడుకుందం. దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఈ దేశంలో రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందా ? అక్కడి దాకా ఎందుకు ? జై జవాన్-జై కిసాన్ అని నినదించాం కదా. దేశాన్ని కాపాడేది సైనికుడైతే... తిండిపెట్టి పోషించేది రైతన్న. అలాంటి కూడు పెట్టే రైతు కడుపు నిండా తినే పరిస్థితి ఉందా ? అందరివీ, అన్ని ప్రభుత్వాలదీ రైతు పక్షపాత విధానాలే. కానీ ఇంకా రైతు ఉరికొయ్యకు ఎందుకు వేలాడుతున్నడు ? పురుగుల మందే అన్నదాతకు పెరుగన్నం ఎందుకైతున్నది ? ఎన్నడన్న ఆలోచించిన్రా ? డబ్బులు పెడితే డీ మార్ట్ లో తిండిగింజలు దొరుకుతున్నయ్ అనుకునే ఈ మోడరన్ సొసైటీకి అవి ఎక్కడి నుంచి వస్తున్నయ్ అన్న ఆలోచన మెమరీ నుంచి మిస్ అయింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకునే ముందు నా కంచంలోకి తిండిని తీస్కొచ్చిన రైతన్నకు వందనం అని ప్రార్థన చేస్తున్న ప్రతీ ఒక్కరికీ కాళోజీ టీవీ తరఫున వందనం. 

 

ఇపుడు కొన్ని దారుణమైన నిజాల్ని మాట్లాడుకుందం. తెలంగాణ విషయానికొద్దం. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అక్షరాల 13 లక్షల కోట్లు. ఆ లెక్కల్ని, అందులో బొక్కల్ని బయటపెట్టే ప్రయత్నంలో భాగంగా కొందరు నిపుణులను కలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చినయ్. జీడీపీ పెంచినం, SGDP దేశంలోనే తెలంగాణదే అత్యధికం అని గొట్టు గొట్టు థియరీలను ప్రజల ముందు పెడుతున్నది కేసీఆర్ సర్కారు. పెద్ద పెద్ద లెక్కల్ని ముందు పెట్టి సంబరాల్ని చేస్తున్నది. అందులో భాగంగా ఇయ్యాల్టి మన టాపిక్ రైతుబంధు. 

(కేసీఆర్ రైతుబంధు గురించి మాట్లాడింది)

 

రాజు తానా అంటే మనం తందాన తాన అనే బాపతు కదా. 2018 మే 10న రైతుబంధు ప్రకటన చేస్తే దేశం నివ్వెరపోయింది. అరె ఇంత గొప్ప దార్శనిక ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ మీద మనం పుట్టడం పూర్వజన్మ సుక్రుతం అని సంకలు గుద్దుకున్నరందరు. నాలుగేండ్లల్ల 50 వేల కోట్లు రైతుబంధు పేరుతో అన్నదాతలకు పంచినం అని గ్రామ గ్రామాన సంబరాలు చేసుకున్నరు గులాబీ పార్టీ నేతలు. అందుల నిఖార్సైన రైతులెవలు లేరనుకోండి. దేశంలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే మరే దేశంలోనూ... మనల్ని పాలించిన బ్రిటన్ కు కూడా ఈ ఆలోచన రాలే అని గప్పాలు నరికిండు ముఖ్యమంత్రి. 

(గులాబీ నేతల రైతుబంధు సంబరాల విజువల్స్)

 

 

వుయ్ ఓపెన్లీ కామెంట్స్.... రైతుబంధు ఓ పెద్ద కుంభకోణం. అదో లీగల్ స్కాం. ప్యూర్లీ ప్రభుత్వ-ప్రతిపక్ష నేతలు కలిసి చేస్తున్న లీడర్ స్కాం. కాదని అనే దమ్ము-ధైర్యం ఉన్నోడు కాళోజీ టీవీ స్టూడియోకొచ్చి మాట్లాడొచ్చు. ఇక అసలు విషయానికొస్తే... సర్కారే రైతుబంధు కోసం 50 వేల కోట్లు ఖర్చుపెట్టినమని అధికారికంగా ప్రకటించింది. పేపర్లలో యాడ్లు కూడా ఇచ్చింది. మొన్నటి బడ్జెట్లో 14800 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించిండు. రెండు సీజన్లకు కలిపి. అంటే ఒక్కో సీజన్ కు 7 వేల 400 కోట్లు. వ్యవసాయ బడ్జెట్ 24 వేల కోట్లలో రైతుబంధుదే అత్యధిక వాటా. 

 

కానీ ఎంతమంది రైతులు ఈ రైతుబంధుతో బాగుపడ్డారు అని ఆలోచించారా ? రైతుబంధు పేరుతో టీఆర్ఎస్ కు ఓటేసే బానిసల్లెక్క చేసుకున్నది సర్కారు. కానీ ఈ పథకం వెనుక జరిగిన దారుణాలు తెలుసా ? అకౌంట్లో పడ్డ రోజుల వ్యవధిలో లిక్కర్ రేట్లు పెరుగుతయ్. ఎరువులు-విత్తనాల ధరలు పెరుగుతయ్. వ్యవసాయ రంగానికిచ్చే సబ్సిడీలు, వ్యవసాయ పనిముట్లకిచ్చే రాయితీలు అన్నీ మాయమైనయ్. ఇన్ పుట్ సబ్సిడీల ఊసు లేదు. పంట నష్టపరిహారం జోలి అసలుకే ఎత్తిపోయింది. ఆయిల్ రేట్లు, ఆహార ధాన్యాల రేట్లు రెట్టింపైనై. అంటే ఒక్క రైతుబంధు ఇచ్చి ఇన్నేసి రాయితీలను ఎగ్గొట్టింది కేసీఆర్ సర్కారు. దాంతో రైతులకు పడ్డ బొక్క ఎంతో తెలుసా ? పెరిగిన కూలీ ధరలు, పంట పెట్టుబడి పెరిగిపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునేంత. రైతుబంధు ఇచ్చినా రైతు ఆత్మహత్యలకు ఆగలే ఈ రాష్ట్రంలో. కాళేశ్వరం కట్టినం, ఉచిత కరెంటిస్తున్నం. నాణ్యమైన ఎరువులు-విత్తనాలిస్తున్నం అని గప్పాలు కొట్టుకున్నది కానీ నిజంగా దుక్కి దున్నేవాడి మనసులో ఏముందో ఈ ఫామ్ హౌజు పాలకుడు ఎన్నడన్న ఇన్నడా ? స్వయంగా రైతుని అని చెప్పుకునే వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అర్సుకున్నడా ? పైసల మంత్రి హరీష్ రావుకు వ్యవసాయం గురించి తెలుసా ? 

 

రైతుబంధు మాటున ఏటా 6 వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినయని తెలుసా. నిపుణులు చెప్తున్న ఫిగరే ఇది. కొంచెం లెక్కల్లోకి వెళ్తే... తెలంగాణలో కోటి 44 లక్షల ఎకరాల మాగాణి, 60 లక్షలకు అటు ఇటుగా రైతులున్నరని సర్కారు లెక్కలు చెప్తున్నయ్. ఆ 60 లక్షల మంది రైతుల్లో 18 లక్షల మంది రైతులు ఎకరం లోపు ఉన్నొళ్లే. 24 లక్షల మంది రైతులు 2 ఎకరాల్లోపు ఉన్నొళ్లే. 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న అన్నదాతలు 11 లక్షల మంది. మొత్తం రైతాంగంలో 5 ఎకరాల లోపు రైతులే 90 శాతం. బడాబాబులు బలిసినోళ్లు కేవలం 10 శాతం అయితే వారికున్న భూములు 90 శాతం. రైతుబంధు లబ్ధిదారులకు సంబంధించిన సింపుల్ ఈక్వెషన్ ఇది. 

 

రైతుబంధుకు సీలింగ్ పెడితే... ఐదెకరాల లోపు రైతులకు మాత్రమే వర్తింపజేస్తే... 5 వేల 500 కోట్లు సరిపోతుందట. అందులోనూ కోత పెడితే 4 వేల కోట్ల వరకు సరిపెట్టొచ్చు అన్నది వ్యవసాయ నిపుణుల సలహా. రైతుల్లో మళ్లీ కౌలు రైతులకు రైతుబంధు వర్తించదు. అంటే నిజమైన రైతుకు దక్కుతున్నది శూన్యం. ఇంకో దిక్కుమాలిన విషయం ఏంటంటే... వ్యవసాయ శాఖ దగ్గర తెలంగాణ రైతుల సాగు భూమి లిస్టు మొత్తం ఉంటది. వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, సుగంధ ద్రవ్యాలు సాగయ్యే లెక్కలన్నీ ఉన్నయ్. ఏ రైతు ఎన్నెకరాల్లో పండిస్తున్నడో అప్ టు డేట్ డాటా ఉంది. ఆ లెక్కన దుక్కి దున్నెటోనిదే భూమి అన్నట్టు సాగు చేస్తున్న రైతుకే రైతుబంధును వర్తిస్తే సగానికి సగం డబ్బు మిగుల్తది. కానీ అలాంటి పని చేయదుగా కేసీఆర్ సర్కారు. 

 

మరి రైతుబంధుతో లాభపడ్డొళ్లు ఎవరంటే ? రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లంచం తీస్కుని భూములు కొన్న రెవిన్యూ అధికారులు, విదేశాల్లో ఉండి తెలంగాణలో భూములు కల్గినవాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్లందరినీ మినహాయిస్తే ఏటా ఇంచుమించు 6 వేల కోట్లు ఖజానాకు మిగుల్తయని వాటితో రైతులకు సంపూర్ణ న్యాయం చేసే వీలుందని చెబితే సారు చెవికెక్కలే. పైగా 50 ఎకరాలున్న ఆసామి వ్యవసాయం చేయాలన్నా... పంటపెట్టుబడికి ఇబ్బందిపడుతున్నడని ఓ దిక్కుమాలిన లెక్క చెప్పండు దొర. ఇట్ల కోత విధిస్తే... ఇంచుమించు 24 వేల కోట్లు మిగిలేవని ఓ ప్రాథమిక అంచనా. ఆ డబ్బుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సగం పూర్తి చేసే అవకాశముండె. అదీ కుదరదంటే.. తెలంగాణలో ఒకే దెబ్బకు విద్యను సంస్కరించే వీలు కలుగుతుండే. జిల్లాకో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే వెసులుబాటు కలుగుతుండె. కానీ అవేవీ తెలంగాణ ప్రజలకు దక్కుకుండా చేసిండు కేసీఆర్. రైతులు బానిసలుగా ఉంటేనే... సంప్రదాయ ఓటర్లుగా ఉంటేనే సారుకు ఫాయిదా కదా ?

 

వైఎస్ ఇచ్చిన 200 పెన్షన్ ను 2 వేలకు పెంచి ఇంట్లో ఒకరికే పెన్షన్ అని కోత విధించిన మన దార్శనికుడికి.. రైతుబంధును స్టీమ్ లైన్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదో ? రైతుబంధు తర్వాత 10 ఎకరాలకు పైన ఉన్న రైతులు సైతం భూమిని కుటుంబ సభ్యులకు మార్పించుకున్నరు. అసొంటొళ్లనళ్ల కట్టడి చేసి... ఇంట్లో ఒకరికే రైతుబంధు ఇస్తే ఎలా ఉంటదన్న సోయి దొరకు రాలేదట. 

 

రాష్ట్రంలో విద్యకు పైసల్లేవు. వైద్యానికి పైసల్లేవు. సంక్షేమంతా ఇలా బడాబాబుల జేబుల్లోకి వెళ్తే ఖజానాలో డబ్బులెట్ల మిగుల్తయో ది గ్రేట్ అర్థిక నిపుణుడు... అపర చాణక్యుడు సర్ ఆర్థన్ కేసీఆర్ దొరకే తెలియాలి. అంగూటి మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలకు రైతుబంధును వర్తింపజేసింది మన గ్రేట్ తెలంగాణ సర్కారు. ఏటా ఆరుకోట్లు ఆయన ఒక్కడి ఖాతాలోకె వెళ్తే.. పేద-బడుగు రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక్క మల్లారెడ్డే కాదు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫామ్ హౌజులు కొని వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా వెనకేసుకున్నడు ఒక్కో ఎమ్మెల్యే. రైతు కడుపు మండుతుంటే.. వాళ్ల జేబులు నిండుతున్నయ్. అట్ల రైతుబంధు సొమ్ముతో జేబులు నింపుకుంటున్న బడాబాబులు ఎంతోమంది. యాదాద్రి చుట్టూ రియల్ ఎస్టేట్ భూములను సొంతం చేసుకున్న సారు బంధుగణానికి కోట్లు ముడుతున్నయ్. ఇదంతా ఎవడబ్బ సొమ్మని ?

 

రైతుబంధు మాటున ఇంతపెద్ద ఎత్తున ఆర్థిక అరాచకం జరుగుతుంటే కళ్లుండి చూడలేని కబోదులు మన దిక్కుమాలిన ప్రతిపక్ష నేతలు. రైతుబంధుతో వాళ్ల జేబులు కూడా నిండుతున్నయ్ గదా. అందరికీ కుక్క బిస్కెట్లేసినట్టు రైతుబంధు బిస్కెట్ ఏసిండు. ఇంకెందుకు నిలదీస్తరు ? సో రైతుబంధు ప్యూర్లీ లీగల్ స్కాం. లీడర్ల స్కాం. ఇపుడు చెప్పండి నిజమైన రైతులకు ఫలితం దక్కని రైతుబంధు తెలంగాణకు అవసరమా ? ధనికుల జేబు నింపే ఈ పథకాన్ని ఇంకా సమర్థిద్దామా ? తేల్చుకోండి. గివ్ ఇట్ అప్ అని పిలుపునిస్తే తిరిగిచ్చింది ఎంతమంది ? ఇచ్చేందుకు ఎంతోమంది మానవతామూర్తులు సిద్ధంగా ఉన్నా... ఎక్కడ టార్గెట్ అయితమో అని జంకుతున్నరు చాలామంది. సో రైతుబంధును రాజకీయ నేతల డ్రామా నుంచి విడిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ పౌరుడిది. అసలైన అన్నదాత కడుపుకొట్టే ఈ దిక్కుమాలిన పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ మేల్కోవాల్సిందే. జాగో తెలంగాణ. కాళోజీ టీవీ.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV