ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్ బాట పడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని చిత్రాలు థియేటర్‌లలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా మరికొన్ని సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు థియేటర్‌లలో, ఇటు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో ఓసారి చూద్దాం..!
"పాగల్" ప్రేమికుడిగా విష్వక్‌సేన్
టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం పాగల్. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా రద్దయ్యింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ‘పాగల్’ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
"ఒరేయ్ బామ్మర్ది" అంటున్న సిద్ధార్థ్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సిద్దార్థ్ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
సునీల్ "కనబడుట లేదు"
సునీల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `కనబడుటలేదు`. ఓ మిస్సింగ్ కేసు, మర్డర్, ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్. బాలరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు.
"సుందరి"గా ప్రేక్షకుల ముందుకు పూర్ణ
కథానాయికగా చేస్తుండటంతో పాటు కీలక పాత్రలు, ప్రత్యేక పాటల్లో నటిస్తూ, బుల్లితెర షోలకు హోస్ట్‌గా చేస్తూ బిజీగా ఉన్నారు పూర్ణ. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘సుందరి’. కల్యాణ్‌జీ గోగన దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
"వివాహ భోజనంబు"కి ఆహ్వానిస్తున్న సత్య, సందీప్‌కిషన్
యువ నటుడు సత్య ప్రధాన పాత్రలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. యంగ్ హీరో సందీప్‌కిషన్, కె.ఎస్.శినిష్‌తో కలిసి నిర్మించారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాళ్ల ఇంట్లోనే ఉండిపోతే, వారి పరిస్థితి ఏంటి? పెళ్లికొడుకు కొడుకు, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ సినిమా కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది...