తీన్మార్ మల్లన్న ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్
10 Aug 2021 జాతీయం 476

తీన్మార్ మల్లన్న ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్ 

 

- హేబస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినా వదలని వేధింపులు అంటూ ఫిర్యాదు 

 - నిత్యం కేసులతో ఇబ్బందులు అంటూ ఫిర్యాదు..

 - జర్నలిజాన్ని  అంతమొందించాలని చూస్తున్న వెలమ దొరలు..!

- ఫిర్యాదు పూర్తి వివరాలు తెలిపిన నాజా జాతీయ అధ్యక్షులు మురహరి బుద్ధారం 

 

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని అంతమొందించాలని చూస్తున్నారని, ప్రభుత్వ విధానాలపై ఎండగట్టిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ కేసులతో వేధిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ( క్యూ న్యూస్) పిర్యాదు పంపారు. ఈ ఫిర్యాదును నాజా  జాతీయ అధ్యక్షుడు మురహరి బుద్ధారం బీసీ కమిషన్కు అందజేశారు.

 

ఫిర్యాదు లోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి

 

దొర కాళ్ళముందు జర్నలిజం మోకరిల్లి క పోతే  కేసులో పరంపర కొనసాగిస్తున్నట్టు, తప్పు చేసిన వారిపై వాస్తవిక కథనాలను రిలీజ్ చేస్తే బ్లాక్మెయిల్ అంటూ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో తెలియజేశారు. ఓ దొంగ స్వామి లీలలపై క్యూ న్యూస్ లో బాధితుల తరపున కథనాలు  రిలీజ్ చేస్తే బ్లాక్మెయిల్ చేశారన్న నిందలు వేసి ఇంక్వైరీ పేరిట గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని కాలయాపన చేసి పంపిస్తున్నారని, ఇటువంటి చిన్న కేసుల విషయంలో కూడా పదే పదే పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.తప్పు చేసిన వారిని వెనకేసుకు వస్తూ  వాస్తవ కథనాలను రిలీజ్ చేసిన నాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి వేళలో  పోలీసులు వాహనాల లో వచ్చి క్యూ న్యూస్ ఆఫీసు కు వచ్చి సోదాలు చేశారు.కొందరి నాయకుల అవినీతి అక్రమాలకు ఆధారాలు లేకుండా  డేటా,హర్డు డిస్కు లు తీసుకెళ్లారు. కావున ఇట్టి చర్యలపై దిగువ, వెనుకబడిన తరగతికి చెందిన వారిని ఎక్కువగా  పోలీసులు టార్గెట్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డిజిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్  లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, చిలకలగూడ పోలీసులపై అత్యుత్సాహం పై  చర్యలు తీసుకోవాలని జర్నలిజాన్ని రక్షించాలని ఫిర్యాదు చేశారు.

 రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయాలని చూస్తున్నారని, రాష్ట్రంలో అనేక మంది ప్రజల మధ్యలో భూతగాదాలు సృష్టించి ఒకరినొకరు చంపుకునేల, వైరుధ్యాలు పెరిగేలా, శాంతిభద్రతలను ప్రజల కోసం కాదు తెరాస పార్టీ నాయకుల కోసమే అన్న పరిస్థితిని సృష్టించి ప్రజల్లో భయాన్ని పుట్టిస్తున్నారని తెలియజేశారు.

ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి

 ఈ ఫిర్యాదును స్వీకరించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి  పూర్తి వివరణ కోరుతూ 15రోజుల్లో నివేదికను అందించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV