రాష్ట్రపతి అభ్యర్థిగా తమిళి సై, ఇరకాటంలో కేసీఆర్
17 May 2022 జాతీయం 382

రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే టైం దగ్గరపడింది. దాంతో అభ్యర్థుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ బలం తెలిసిందేగా. ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిదే గెలుపు ఖాయం. 51 పర్సెంట్ మెజారిటికీ కాస్త దూరంలో ఉంది బీజేపీ. మిత్రపక్షాలు, బయటి నుంచి మద్ధతిచ్చే పక్షాల లెక్కలు వేసుకుంటే కమలం పార్టీ నిలబెట్టే అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అన్నది క్లియర్. కానీ ఆ పార్టీ మదిలో ఎవరున్నారు ? ఇప్పటికే ఎల్ కే అద్వానీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ల పేర్లు ఆ పార్టీ పరిశీలనలో ఉన్నాయని లీకులొచ్చాయి. అయితే ఇపుడు అనూహ్యంగా మరో కొత్త పేరు వెలుగులోకొచ్చింది. తను ఎవరో కాదు తెలంగాణ గవర్నర్ తమిళ్ ఇసై సౌందర రాజన్. యెస్. తెలంగాణ గవర్నరే కాబోయే రాష్ట్రపతి. కాళోజీ టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్న కథనమిది.

 

భారత రాష్ట్రపతి. అత్యున్నత ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి ప్రథమ పౌరుడు. ఎంతో మంది ఈ పదవికి వన్నె తెచ్చారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ నుంచి డాక్టర్ అబ్దుల్ కలాం దాకా ఎందరో రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు. అలాంటి అత్యున్నత స్థానానికి బీజేపీ నిలబెట్టబోయే అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీకి పోటీగా దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల కూటమి ఏకమై నిలబెట్టాలనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ-షా మోనోపలికి చెక్ పెట్టాలన్న కసి ఇతర నేతల్లో కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ నేతలు మమతా బెనర్జీ, శరద్ పవార్, కేసీఆర్. స్టాలిన్, జగన్ లాంటి నేతలు సంఖ్యాబలంలో ఎత్తులో ఉన్నా కేంద్రంతో-బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ క్యాంపులో ఉండటం బీజేపీకి మైనస్.

 

నిజానికి పది లక్షలకు పైగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో సగానికి కొద్ది దూరంలో బీజేపీ సంఖ్యా బలం ఉంది. పైన చెప్పిన నేతల్లో ఎవరో ఒకరు మద్ధతిస్తే తప్ప బీజేపీ అభ్యర్థి గెలుపు అసాధ్యం. గతంలోలా ఈసారి బెదిరించో, బయపెట్టో మద్ధతు తీసుకునే పరిస్థితి కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీకి లేదు. కారణం దేశవ్యాప్తంగా ఆ పార్టీ పాలనపై తిరుగుబాటు వెల్లువెత్తుతోంది. మోడీ-షా నియంత పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి టైంలో వస్తున్న రాష్ట్రపతి ఎన్నిక మోడీ-షా ద్వయానికి సవాల్ గా మారింది.

 

దీంతో ఆ ద్వయం కొత్త ఎత్తుగడకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్, తమిళనాడు వాసి తమిళ్ ఇసై సౌందర రాజన్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలన్నది ఆ పార్టీ ఆప్షన్. సొంత రాష్ట్రం నేతగా ఎంకే స్టాలిన్... తమిళి సైకి మద్దతివ్వడం గ్యారెంటీ. పైగా తమిళనాడులో స్టాలిన్ సంఖ్యా బలం భారీగానే ఉంది. ఒక్క స్టాలిన్ మద్ధతిస్తే చాలు బీజేపీ గట్టెక్కినట్టే. వ్యతిరేక పక్షాలన్నీ ఏకమైనా సరే... స్టాలిన్ సపోర్ట్ తో రాష్ట్రపతి పదవిని గెలుచుకునే అవకాశం బీజేపీకి ఉంది. దాంతో తమిళి సై అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసే దిశగా ఆ పార్టీ అడుగులేస్తున్నట్టు మనకున్న సమాచారం. గత ఎన్నికల్లో అవసరానికో, ప్రతిపక్షాల బలహీనత కారణంగానో... కేసీఆర్-జగన్ బీజేపీ నిలబెట్టిన రామ్ నాథ్ గోవింద్ కు మద్ధతునిచ్చారు. జగన్ ఈసారి కూడా బీజేపీ వైపే మొగ్గుచూపుతారు అందులో డౌట్ లేదు. కానీ కేసీఆర్ తోనే బీజేపీకి వచ్చిన చిక్కంతా. తాను మద్ధతివ్వకపోగా.. ఇచ్చే వాళ్లను చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో బీజేపీ తెలంగాణ గవర్నర్ కు ఛాన్సివ్వబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కేసీఆర్ చాణక్యానికి బీజేపీ అల్టిమేట్ చెక్ పెట్టినట్టవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV