టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే..!

టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్‌ రిలీజ్.. భారత్ మ్యాచ్ లు ఎప్పుడంటే..!

 

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ మెగా టోర్నీ ఒమన్‌తో పాటు యూఏఈ వేదికగా జరగనుంది. అక్టోబర్‌ 23న ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచ్‌తో సూపర్‌ 12 లీగ్‌ స్టేజీ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక సూపర్‌ 12లో గ్రూఫ్‌ 2లో ఉన్న భారత్‌.. అక్టోబర్‌ 24న దాయాది పాకిస్తాన్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గనిస్తాన్‌తో, నవంబర్‌ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్‌ 8న ఏ1 క్వాలిఫయర్‌తో పోటీపడనుంది. 

 

నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీఫైనల్‌.. నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డే కేటాయించారు. కాగా, తొలిరౌండ్లో గ్రూప్‌-బి నుంచి తొలి మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్‌ 17న మధ్యాహ్నం మ్యాచులో ఒమన్‌, పపువా న్యూగినీ పోటీపడతాయి. సాయంత్రం మ్యాచులో స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌ తలపడతాయి.

 

కాగా, టోర్నీలో భాగంగా మొత్తం నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు ఉంటాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ద షేక్ జాయెద్‌ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, ఒమ‌న్ క్రికెట్ అకాడ‌మీ గ్రౌండ్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వహించ‌నున్నారు. అయితే టోర్నమెంట్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జ‌ట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒమ‌న్‌, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులు మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV