దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బీఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్ల కోసం ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటి ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. రుణాల దగ్గర నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు పలు రకాల సేవలు లభిస్తాయి.
ఎస్‌బీఐ అందించే సర్వీసుల్లో ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్ కూడా ఒకటి. మీరు ఈ స్కీమ్‌లో మీకు నచ్చినంత కాలం డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలు ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటే వీటికి కూడా వర్తిస్తుంది.
మీరు నెలకు రూ.10,000 ఆదాయం పొందాలని భావిస్తే.. మీరు రూ.5,07,964 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మీకు ప్రతి నెలా రూ.10,000 వస్తాయి. అంటే 7 శాతం వడ్డీ లభిస్తోందని చెప్పుకోవచ్చు. అదే మీరు రూ.5 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే ఇంకా ఎక్కువ రాబడి వస్తుంది.
స్టేట్ బ్యాంక్ యాన్యుటీ స్కీమ్‌లో చేరడం వల్ల కనీసం రూ.1,000 నుంచి డబ్బులు పొందొచ్చు. అయితే మీరు ఈ స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ.25 వేలు ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు డిపాజిట్ చేసిన డబ్బు ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయి.