టీఆర్ఎస్‌కు గట్టి షాకిచ్చేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్.. కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు!
30 Aug 2021 జాతీయం 1134

టీఆర్ఎస్‌కు గట్టి షాకిచ్చేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్.. కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు!

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా రాజకీయ పార్టీలు మాత్రం రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రజల్లో పట్టుకోసం అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో సెప్టెంబర్‌లో సంస్థాగత నిర్మాణ సందడి ప్రారంభం కానుంది.
ఇక ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ నిర్వహించిన దళిత, గిరిజన దండోరా ఆత్మగౌరవ సభ విజయం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. జిల్లా కేంద్రంలో త్వరలో జిల్లాస్థాయిలో గిరిజన, దళిత ఆత్మగౌరవ దండోరా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో తెరాస పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినపోయిన వారు, గతంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి తెరాసలో చేరిన వారే టార్గెట్ గా  "ఆపరేషన్ ఆకర్ష్" మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలాంటి నేతలను 12 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లు తెలుస్తోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారికీ పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు.

అలాగే రాబోయే ఎన్నికల్లోనూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తారన్న ప్రచారం గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. దీంతో తెరాస పార్టీలో కొనసాగితే రాజకీయ జీవితం ఉండదనే అభిప్రాయంతో ఉన్న నేతలతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది. వీరితో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి తెరాస పార్టీలో చేరిపోయిన వారితోను టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నవారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయమని హస్తం నేతలు పేర్కొంటున్నారు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV