అవునురా బై రాజ్యాంగం రాసింది మా తాతే.. మరోసారి విరుచుకుపడ్డ ప్రవీణ్ కుమార్
25 Aug 2021 జాతీయం 546

అవునురా బై  రాజ్యాంగం రాసింది మా తాతే.. మరోసారి విరుచుకుపడ్డ ప్రవీణ్ కుమార్
 
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బహుజనుల రాజ్యమేనని.. ఈ రాజ్యంలో ప్రగతిభవన్ పేరును బహుజన భవన్‌గా మారుస్తామని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర  కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులో బీఎస్పీ పార్టీ  నిర్వహించిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దళితులను, బహుజన జాతులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
 
తాము భారత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ వారసులమని.. మడమ తిప్పడం, మాట తప్పడం తమకు తెలియదన్నారు. రాజ్యంగా రాసిందే మా తాత అంబేద్కర్ అని.. దళిత, బహుజనులే భవిష్యత్‌లో పాలకులు అవుతారని ప్రవీణ్ కుమార్ అన్నారు. దళితులకు చదువు రాదని ఓ ఎమ్మెల్యే అవమానపరిచారని కానీ మా బిడ్డలు డాక్టర్లు, పైలెట్లు, ఇంజనీర్లుగా ఉన్నారని వారే పాలకులు కాబోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇప్పటి వరకూ తెరాస ప్రభుత్వం దోచుకున్న వేల కోట్ల డబ్బులను గల్లా పట్టి తీసుకొస్తామని.. వాటిని వైద్యం, విద్య, ఉపాధి కల్పనకు ఖర్చు చేస్తామని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV