నుపుర్ శర్మ వివాదం, గల్ఫ్ కంట్రీస్ తో భారత్ దౌత్య సంబంధాలపై దెబ్బ
08 Jun 2022 జాతీయం 411

కత్తి పట్టినోడు కత్తికే బలైతడని. హేట్ స్పీచెస్ తో దేశంలో అశాంతి రాజేస్తున్న బీజేపీ ఇపుడు దానికే బలయ్యేలా కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ... మహ్మద్ ప్రవక్తపై చేసిన నీచ వ్యాఖ్యలు భారత దౌత్య సంబంధాలకు గొడ్డలిపెట్టుగా మారింది. 

 

ఓ నేషనల్ ఛానెల్ డిబేట్ లో భాగంగా మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది నుపుర్ శర్మ. అది దేశం దాటి గ్లోబల్ వైడ్ గా పాకింది. ఇస్లామిక్ స్టేట్స్ నుంచి భారత్ పై ఆంక్షలు అమలవుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయ కార్మికులపై ఆంక్షలు అమలవుతున్నాయి. గల్ఫ్ కంట్రీస్ కు వలస వెళ్లిన సుమారు 90 లక్షల మంది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అలాగే భారత్ నుంచి ఎగుమతులు, భారత్ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే  దిగుమతులపై ఆంక్షలు విధించే పరిస్థితి కనిపిస్తోంది. 

 

57 దేశాల ఇస్లామిక్ సహకార సంస్థ ఆర్గనైజేషన్ అఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్.. ఒక్క తాటిపైకొచ్చి భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అన్ని గల్ఫ్ కంట్రీస్ లోని ఇండియన్ ఎంబసీలకు నోటీసులు జారీ అయ్యాయి. 

 

ఇకపోతే ఈ వివాదంపై ప్రతిపక్షాలు ఇంప్లీడ్ అయ్యాయి. ఓ పార్టీగా బీజేపీ చేసిన తలతిక్క పనికి భారత ప్రభుత్వం ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేతల క్వశ్చన్. డివైడెట్ ఇంటర్నల్లీ, ఇండియా బికమ్స్ వీక్ ఎక్స్ టర్నల్లీ అని రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీతో సహా ముస్లిం నేతలంతా బీజేపీ క్షుద్ర రాజకీయాలను తూర్పారబట్టారు. దాంతో ఈ వివాదం చిలికి చిలిక గాలివానలా మారింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతర్ లో పర్యటిస్తుండగానే ఈ వివాదం చెలరేగడం ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట మసకబారినట్టైంది.

 

నిజానికి భారత ఆయిల్ అవసరాలను సింహభాగం తీర్చేది గల్ఫ్ కంట్రీసే. ఆయిల్ ఎగుమతుల్ని ఆపేస్తే భారత్ పరిస్థితి ఏమిటి ? ఓ వైపు దేశంలో మతపరమైన హింసోన్మాదం బుసలు కొడుతుంటే... ఓట్ల రాజకీయాలు విభజనవాదానికిి పాలుపోసే దుష్ట రాజకీయాలతో అంతిమంగా నష్టపోయేది భారతేనని ఎంతమంది మొత్తుకున్న కాషాయ పార్టీ చెవికెక్కలేదు. ఇపుడు అనుభవించే స్థితికి వచ్చింది. ఒక్క యూఏఈ నుంచే భారత్ కు ఏటా 1400 కోట్ల డాలర్ల రెవిన్యూ వస్తుంది. భారతీయ హిందువులను ఎమిరేట్స్ కు నో ఎంట్రీ బోర్డు పెడితే ఎలా ఉంటుంది... నేను చూసిన భారత్ ఇది కాదని యూఏఈ క్వీన్ హింద్ అల్ ఖాసిమీ స్పందించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 

 

వ్యూహత్మకంగా-ద్వైపాక్షికంగా పశ్చిమాసియా దేశాలతో భారత్ కు దౌత్య సంబంధాలు చాలా కీలకం. నిజానికి గతంతో పోలిస్తే మోడీ హయాంలో గల్ఫ్ దేశాలతో స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి. కానీ నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో ఆ సంబంధాలన్నీ దెబ్బతినే పరిస్థితి నెలకొంది.

గతంలో మహ్మద్ ప్రవక్తను నీచంగా చిత్రీకరిస్తూ ఆర్టికల్ రాసిన చార్లీ హెబ్డో పత్రికపై టెర్రరిస్టు దాడులు జరిగాయి. ఎన్నడూ లేనిది ఫ్రాన్స్ లో టెర్రరిజం వేళ్లూనుకుంది. నుపుర్ శర్మ వ్యాఖ్యలతో మళ్లీ భారత్ లో టెర్రరిస్టుల దాడులు పెరుగుతాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్ట మసకబారింది. దీని తదనంత పరిణామాలు ఎలా ఉంటాయో... ఎంత మూల్యం చెల్లించుకోవాలో ఊహకందండం లేదంటున్నారు నిపుణులు. ఇకనైనా ఈ విభజన రాజకీయాలపై బీజేపీ తిరిగి చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేకపోతే దేశమే అల్లకల్లోలమయ్యే పరిస్థితి రావచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మరి బీజేపీ తన సిద్ధాంతాలను మార్చుకుంటుందా ?

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV