సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్..
హైదరాబాద్ ఈ-సిటీలో నెలకొల్పిన నూతన ప్లాంట్ ను మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్.
రూ. 483 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ సెల్స్ మరియు సోలార్ మాడ్యుల్స్ ను తయారు చేస్తారు.
ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎనర్జీస్ ఫౌండర్ మరియు చైర్మన్ శ్రీ సురేందర్ పాల్ సింగ్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండి శ్రీ వి. నరసింహా రెడ్డి పాల్గొన్నారు.