విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తున్న మహేశ్‌ బాబు.
10 Aug 2021 సినిమా 567

విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తున్న మహేశ్‌ బాబు!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సోమవారం మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ పేరుతో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయగా, ఇది రికార్డులు బ్రేక్ చేస్తుంది. విడుద‌లైన 24 గంట‌ల్లో ఈ బ్లాస్ట‌ర్ ప్రోమోకు 25.7 మిలియ‌న్ వ్యూస్‌, 7ల‌క్ష‌ల 54వేల లైక్స్ వ‌చ్చాయి. దాంతో మహేశ్‌ బాబు ఖాతాలో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్ గా  రికార్డ్ సాధించింది. స‌ర్కారు వారి పాట టీజ‌ర్‌ని ఆగస్టు 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్.. అందుకు కొద్ది గంటలకు ముందే అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు.

సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే ఈ వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియో మహేశ్‌ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని సరికొత్త లుక్‌లో మహేశ్ క‌నిపించడం, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం అదిరిపోవడంతో ఈ టీజర్‌ సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. కాగా,  బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్‌ స్వరాలూ సమకూరుస్తున్నాడు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV