అధికారం కోసం కేసీఆర్ దేనికైనా తెగిస్తారు: కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
20 Aug 2021 జాతీయం 549

అధికారం కోసం కేసీఆర్ దేనికైనా తెగిస్తారు:  కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
 
తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా భాజపా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా కిషన్‌రెడ్డి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో మాట్లాడారు. ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో ఫామ్ హౌజులు కట్టారని విమర్శించారు. 
 
రాష్ట్రంలో  గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తోందని.. కేసీఆర్ సర్కారు మాత్రం ఏం ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు.  కేసీఆర్‌ అధికారం కోసం దేనికైనా తెగిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రను అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, 12 జిల్లాలు, 7 పార్లమెంట్‌, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 324 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర సాగనుంది.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV