కేసీఆర్ దళిత బంధు వ్యూహం బెడిసికొట్టనుందా ..?
15 Aug 2021 529

బంధు అందరికా..?  లేక కొందరికా?

 ????????బంధు అసలుకే ఎసరు వస్తుందా..? అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. 

????????సీఎం కేసీఆర్ వ్యూహం పెద్దగా పనిచేసే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా, దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం, వారికి, “దళిత బంధు” పేరుతో రూ.10 లక్షలు నేరుగా అందించడం, అనే పథకాన్ని ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఈ పథకం ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి విఘాతంగా మారే అవకాశాలు ఉన్నాయి. 

????????రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ ముందుగా హుజరాబాద్ లో “పైలెట్ ప్రాజెక్టు” కింద దీన్ని ఈ నెల 16న ప్రారంభించనున్నారు. అయితే, ఇప్పటికే, ఈ పథకం కింద, వాసాలమర్రి లో 76 దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.7.76 కోట్లను అందజేశారు. తన దత్తత గ్రామం వాసాలమర్రి లో దళిత వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు బాసటగా నిలిచారు. 

????????ఇదే పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా, తమకు అనుకూలంగా మలుచుకునే ఆలోచనతో సీఎం కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు.ఇందులోభాగంగానే, ప్రస్తుతం, హుజరాబాద్ లో జరిగే ఉప ఎన్నికల సందర్భంగా దాన్ని వేదికగా తీసుకుని “దళిత బంధు” పథకాన్ని ప్రారంభించనున్నారు. 

????????ఇందుకోసం, మొదటి విడతగా రూ.500 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రూ.500 కోట్లను, ఈ నెల 16న, హుజురాబాద్ వేదికగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. అయితే, హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 54 వేల మంది దళిత ఓటర్లు ఉన్నారు. దాదాపు 16 వేల దళిత కుటుంబాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ????????????????వీరందరికీ ‘దళిత బంధు” పథకం కింద, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంది. ????????????????అయితే, మొదటి విడత రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో, కేవలం 5 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. దీంతో మిగతా 11 వేల మంది కుటుంబాల పరిస్థితి ఏంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

????????????????మొదటి విడతలో కొంత మందికి ప్రయోజనం చేకూర్చితే, మిగతావారు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలున్నాయి. దళిత కుటుంబాల్లోని 65 శాతం మంది లబ్ధి పొందని కారణంగా టీఆర్ఎస్ పై కోపంతో రగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది.

????????????????హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాల అందరికీ రూ. 10 లక్షల చొప్పున అందించేందుకు మరో రూ.1100 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఇదంతా కేవలం మరో 15 రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేయగలిగితే, దళిత వర్గాల్లో ఉన్న మొత్తం ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్ కు అనుకూలంగా పడే అవకాశాలు ఉన్నాయి. 

????????????????లేనిపక్షంలో దళిత వర్గాల్లో చిచ్చు రాజేసిన అపవాదును టిఆర్ఎస్ మూటగట్టుకుని చతికిల పడే అవకాశాలు ఉన్నాయి. “దళిత బంధు పథకం” లబ్ధి పొందని దళితులు సాధారణంగానే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. 

????????????????దీంతో టిఆర్ఎస్ పార్టీ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి కులాల మధ్య చిచ్చు రగిలించే, “తేనెతుట్టె”ను కదిలించిన ట్లు అవుతోంది.

????????????????అన్ని కులాలకు రూ.10 లక్షలు:

**************

????????????????కేవలం, దళిత కుటుంబాలకే కాకుండా, పేద, అణగారిన వర్గాల కుటుంబాల అందరికీ రూ.10 లక్షల చొప్పున అందించాలని ఆయా కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అగ్రవర్ణాల అయిన రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాల సంఘం నేతలు కూడా తమకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 

????????????????అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం లో “రెడ్డి” సామాజిక వర్గానికి చెందిన 22,600 ఓట్లు, వెలమ, బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం మైనారిటీ, ఓసి వర్గాలకు చెందిన ఓట్లు దాదాపు 40 వేల వరకు ఉన్నాయి. 

????????????????వీరంతా ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన లబ్ధి పొందని కారణంగా, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. 

????????????????ప్రధానంగా వెనుకబడిన జాతిగా ఉన్న గిరిజనులకు, దళితుల వలే రూ. 10 లక్షలు తమకు, ఇవ్వనట్లయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు.

????????????????అలాగే యాదవులు, నాయి బ్రాహ్మణులు, రజకులు ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో అందే తోక సహాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

????????????????తమకు కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే రూ. 10లక్షల సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. యాదవులకు గొర్రెలు ఇచ్చి, మచ్చిక చేసుకోవడం కుదరదని ఆ వర్గాలు తేల్చి చెబుతున్నారు. 

????????????????అలాగే నాయి బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంటు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇటీవలే కల్పిం చింది. దీన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ఈ రెండు వర్గాలు, తమకు ఖచ్చితంగా రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

????????????????యాదవ సామాజిక వర్గానికి 22,150, రజక సామాజిక వర్గానికి 7,600, నాయి బ్రాహ్మణులకు 3,300, ముదిరాజ్ సామాజిక వర్గానికి 23 220, పద్మశాలి లకు 26,350 ఓట్లు, మున్నూరు కాపులకు దాదాపు 30 వేల ఓట్లు ఉన్నాయి. 

????????????????అలాగే మైనారిటీలకు 5,100 ఓట్లు ఉన్నాయి. ఇతర అణగారిన సామాజిక వర్గాలకు కలిపి 12 వేల కోట్లు ఉన్నాయి. ప్రధానంగా, దళిత సామాజిక వర్గానికి అంటే అత్యంత వెనుకబాటుకు గురైన ఎస్టి సామాజికవర్గానికి 7,600 ఓట్లు ఉన్నాయి. వీరికి కూడా ఇలాంటి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందకపోవడం వల్ల, తమకు సైతం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

????????????????గాలికి కొట్టుకుపోయిన ఆసరా, రైతుబంధు:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్లు, రైతు బంధు పథకాలు హుజురాబాద్ నియోజకవర్గంలో వెలవెలబోతున్నాయి. రూపాయలు 10 లక్షల ఆర్థిక సాయంతో “దళిత బందు” ప్రవేశపెట్టిన పథకం వల్ల, ప్రభుత్వం, ఇప్పటికే ఇస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకం ద్వారా వచ్చే లబ్ధి పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే, ఆసరా పింఛన్లు రైతుబంధు పథకం రూ.10వేలకు మించి కనిపించడం లేదు. కానీ, “దళిత బంధు” పథకం రూ. 10 లక్షలు అనేసరికి ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ????????????????ఒకప్పుడు ఈ రెండు పథకాల ద్వారా ప్రభుత్వం ఎంతో ప్రాచుర్యాన్ని, ప్రజల మన్ననలను పొందింది. అలాంటి, ఈ పథకాలు నేడు హుజరాబాద్ లో వెలవెలబోతున్నాయి. అసలు వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటీవల కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గం లో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పక్కా భవనాలు ప్రతి గ్రామంలో నిర్మిస్తామని, వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే, ఇవేమీ హుజురాబాద్ ప్రజలకు పెద్దగా ఎక్కడం లేదు.

????????????????ఎందుకంటే, రూ.10 లక్షల ముందు ఇవన్నీ ఏ మేరకు తులతూగవని భావించడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల అందిస్తే గాని ఓట్లు వేసే పరిస్థితి కానరావడం లేదు. ఎందుకంటే అంత పెద్ద మొత్తం రావడం వల్ల, ఆ కుటుంబం మొత్తం తన భవిష్యత్తును తీర్చిదిద్ది కుంటుంది. 

????????????????అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడి ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ, అవి వారి చెవికి ఎక్కడం లేదు. అంతా, రూ. 10 లక్షల మయం, ఏ నోట విన్నా, తమకు 10 లక్షలు ఖచ్చితంగా కావాలని డిమాండ్ వస్తోంది. మరి, ప్రభుత్వం అన్ని కులాల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉందా..? లేకుంటే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి..? అనేది అగమ్యగోచరంగా కనిపిస్తోంది.

????????????????అనుకున్నది ఒకటి.. అవుతుంది మరొకటి:

టిఆర్ఎస్ నాయకులు ఈ ఉప ఎన్నికల ముందు “దళిత బంధు” పథకాన్ని ప్రవేశపెట్టి ముందుగా హుజరాబాద్ నియోజకవర్గం లో లబ్ధి పొందాలని భావించినప్పటికీ, అది కాస్తా తిరగబడుతుంది. “దళిత బంధు” ద్వారా తమకు ఓట్లు కుప్పలుతెప్పలుగా వస్తాయని ఆశించిన టిఆర్ఎస్ కు శృంగభంగం ఎదురయ్యే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా, తమకు రూ. 10 లక్షలు ఇస్తేనే ఓటు వేస్తామని కచ్చితంగా చెబుతున్నారు.ఈ పరిస్థితిని టిఆర్ఎస్ ఎలా తట్టుకుని ముందుకు సాగుతుందో అర్థం కాని అయోమయం ఏర్పడింది. 

????????????????ఇదంతా కులాల ప్రాతిపదికన ఆర్థిక సహాయం చేయడం అనేది పెద్ద “తేనె తుట్టె” ను కదిలించడమేనని ప్రభుత్వం తెలుసుకోకపోవడం శోచనీయం. తాము చేసిన ప్రతిపనికి ప్రజలు జై కొడతారు అని అనుకోవటం మూర్ఖత్వమే. కానీ, ఈ విషయాలను పెద్దగా పట్టించుకోని టిఆర్ఎస్ పార్టీ నేతలు ముందు ముందు తమ రాజకీయ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్ది కుంటారో తెలియని సందిగ్ధత ఏర్పడింది.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV