దళిత బంధు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం... TANA వర్చువల్ మీటింగ్ లో మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్.
స్వాతంత్ర్య భారతదేశం 75 వసంతోత్సవాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘము (TANA) అధ్వర్యంలో స్వాతంత్ర్య భారత అమృతోత్సవం పేరుతో వర్చువల్ మీటింగ్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా TANA
సభ్యులకు, ప్రతినిధులకు, గౌరవ అతిధులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 75 వ స్వాతంత్ర్య ధినోత్సవ శుభాకాంక్షాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈ వర్చువల్ మీటింగ్ లో TANA సభ్యులతో మాట్లాడుతూ...
ఈ స్వాతంత్ర్య పర్యదినాన , ఆనాడు స్వాతంత్ర్య పోరాటం లో పాల్గోని తమ మాన, ప్రాణ, ధనాన్ని త్యాగం చేసిన నాటి మహనీయులందరినీ ఈ సంధర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైన వుంది. వారి సేవలు, త్యాగం వల్ల స్వేచ్చ, స్వాతంత్ర్య ఫలాలను మనం అందుకుంటున్నామన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారధి , గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై సాగించిన పోరాటం కూడా మరో స్వాతంత్ర్య పోరాటం మాధిరిగా నిలిచిందన్నారు. KCR గారి పోరాట స్పూర్తి, నిరంతర తపన వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం గత ఆరు , ఏడు సంవత్సరాలలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
అభివృద్ధి , సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ రాష్ట్రం ప్రయోగ శాల గా నిలిచిందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
నేడు సిఎం కెసిఆర్ గారు ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం నేడు దేశానికి అధర్శంగా నిలువబోతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇండ్రస్ట్రీయల్ ఫాలసీ వల్ల నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమోజాన్, మైక్రోసాప్ట్, ఆఫిల్ కంపనీ లు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నివారణకు తయారు అవుతున్న వ్యాక్సిన్ హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర అభివృద్ది , శాంతి భద్రతలు, సమతుల్య వాతావరణం, విస్తారంగా ఉన్న భూములు ఉండటం తో పాటు సమర్థ నాయకత్వం వల్ల నేడు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం గా అభివృద్ది చెందుతుందన్నారు. తెలుగు వారందరూ ఏ దేశం లో ఉన్న మనం అంతా భారతీయలం.. మన సంస్కృతి, సాంప్రదాయాలను కోనసాగిస్తున్నందుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయిన మనమంతా సోదరబావంతో కలసి మెలసి మన ప్రాంతాలను అభివృద్ది చేసుకోవాలని పేర్కొన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు మన రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకరావాలని పిలుపునిచ్చారు.
మన ప్రాంతాల అభివృద్దికి పూర్తి సహాకారం అందించాలి.
ప్రభుత్వం తరుపున 1 శాతం మాత్రమే ఉద్యోగాలను కల్పించగలము. కానీ నేడు ప్రవేట్ రంగంలో విస్తృత అవకాశాలు ఉండటం వల్ల లక్షాలాది ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను పారిశ్రామిక వేత్తలు సృష్టించవచ్చు అని పేర్కొన్నారు.
అందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహాకారాలను పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నామన్నారు.
అందుకు అవసరమైన సహాకారాన్ని సిఎం కెసిఆర్ , ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కె టి ఆర్ గార్లు ప్రభుత్వం తరుపున అందిస్తున్నారని TANA ప్రతినిధులకు వివరించారు..
యువజన సర్వీసుల శాఖ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డవలఫ్ మెంట్ సెంటర్లు ను ప్రారంబించి యువతీ, యువకులకు అధునిక శిక్షణ ను అందిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాచీన చరిత్ర వుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ గారు రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్రాంతాల అభివృద్ది కి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
అందులో భాగంగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లో నాటి కాకతీయ రాజుల సృజనాత్మకత, అద్బుత శిల్ప కళా సంపద రామప్ప కు యునేస్కో గుర్తింపు లభించినందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో గర్వకారణం గా ఉందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ది కి ఎంతో ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు…
నేడు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వల్ల పర్యాటక రంగం ఎంతో నష్ట పోయిందన్నారు. మన దేశానికి చెందిన పర్యాటకులు ఇతర దేశాలకు వెల్లి పర్యాటక ప్రదేశాలను చూసేకంటే మన రాష్ట్రంలో ఎంతో అధ్బుతమైన జలపాతాలు, ప్రకతి సౌందర్యమైన ప్రదేశాలు, అడవులు, నదులు, ఎకో టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. దేశీయంగా మన దేశానికి, మన ప్రాంతాలకు ఎంతో గుర్తింపు ను తీసుకరావచ్చు. అందుకు ప్రభుత్వం తరుపున పర్యాటకులకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు పర్యాటక రంగం పై అధారపడి మనుగడ సాదిస్తున్నాయన్నారు.
ముఖ్యంగా ఐరోపా లోని పలు దేశాలు ప్రాన్సు, ఇటలీ, జర్మనీ, నార్వే, స్పెయిన్ లాంటి దేశాలు పర్యాటకుల సందర్శన ద్వారానే ఎంతో అధాయాన్ని పోందుతున్నాయన్నారు.
తానా సభ్యులు విదేశీ పర్యాటకులను మన తెలుగు రాష్ట్రాలలో పర్యటించే విధంగా ఆహ్వానించాలని సూచించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. తద్వారా మన తెలుగు రాష్ట్రాల ప్రాముఖ్యత విదేశీయులకు తెలుస్తుందన్నారు. పర్యాటకంగా మన ప్రాంతాలకు గుర్తింపు లభిస్తుందన్నారు.
స్వాతంత్ర్య ధినోత్సవం సందర్భంగా తానా సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వర్చువల్ మీటింగ్ లో పాల్గోనడం అనందంగా వుందన్నారు.
తానా సంస్థ అంటే ప్రత్యేక గౌరవం ఉందన్నారు. గత 45 సంవత్సరాలుగా విదేశాలలో ఉండి తెలుగు ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తున్నందుకు తానా సంస్థ ప్రతినిధులను అభినందించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
కోవిడ్ సమయంలో మన తెలుగు రాష్ట్రాలకు సుమారు 20 వేల మెడికల్ కిట్స్ , 516 అక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు పంపించి తమ సేవా భావాన్ని చాటారని, అంతేకాకుండా తెలుగు బాషాభివృద్దికి , సాహిత్యాభివృద్దికి తానా ఎంతో కృషి చేస్తున్నందుకు అభినందనలను తెలిపారు.
తానా సంస్థ సేవలు ఇంకా వివిధ రంగాలకు విస్తరించాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున తానా సంస్థ కు పూర్తి సహాయ సహాకారాలను అందిస్తామన్నారు.
తానా సభ్యులందరికీ మరోసారి స్వాతంత్ర్య ధినోత్సవ శుభాకాంక్షాలు తెలియజేశారు .
ఈ వర్చువల్ మీటింగ్ లో TANA అధ్యక్షులు - శ్రీ అంజయ్య చౌదరి లావు , పూర్వ అధ్యక్షులు - శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఛైర్మెన్ - డా. హనుమయ్య బండ్ల , ఎక్స్ క్యూటివ్ వైస్ ప్రసిడెంట్ – శ్రీ నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ ఛైర్మెన్ – శ్రీ వెంకట రమణ యార్లగడ్డ , కల్చరల్ కో – ఆర్డినేటర్ – శ్రీమతి శిరీష తూనుగుంట్ల, గౌరవ అతిధులు.. శ్రీ ఎ వి రాజమౌళి .ఐ ఎ యస్ – ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, శ్రీమతి కరణం మల్లీశ్వరీ – ఒలంపిక్స్ మెడలిస్టు, ప్రస్తుతం వైస్ ఛాన్సులర్ - స్పోర్ట్ యూనివర్సిటీ ఆప్ న్యూడిల్లీ.
ప్రోపెసర్. గోపనపల్లి ప్రసాద్, డా. విజయ భాస్కర్ గార్లు పాల్గొన్నారు.