కేసీఆర్ పరివారం ఏడేళ్లలో ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు?
20 Aug 2021 474

కేసీఆర్ పరివారం ఏడేళ్లలో ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నారు?

   

 ఏడేళ్లలో డెబ్బయివేల  జీవోలు మాయమయ్యాయి. ప్రజల సొమ్ము  ఎటు పోయిందో ? 

ప్రజల పరిపాలన ఎట్ల సాగుతున్నదో తెలువకుండా చేయబడుతున్నది. పారదర్కత లేకపోవడం అవినీతిని, అక్రమాలను, నిధులను మటుమాయం చేస్తున్న విషయాలు తెలువకుండా దాచి పెట్ట

డానికే. అందినంతా దోచుకొని దాచుకొని ఇతర దేశాలకు, బినామీలకు తరలించి వేల కోట్లకు పడగలెత్తడానికే. మేఘా కృష్ణారెడ్డి, మైహోం జె. రామేశ్వర రావు మొదలుకొని కెసిఆర్, కెటీఆర్, హరీష్ రావు, కవిత, , సంతోష్ రావు తదితరులు ఏడేళ్లలో లక్షల కోట్లు రకరకాల రూపాల్లో మూటలు కట్టుకున్నారు.  సమాచార హక్కు చట్టం ప్రకారం . 

 వేల కోట్ల కుంభ కోణం.

మిషన్ భగీరథ, కాళేశ్వరం , ఖర్చు ఎంత? 

 

 కోట్లాది విలువైన భూముల కెటాయింపు, భూముల బదిలీ, భూముల ఆక్రమణ, కాంట్రాక్టులలో కమిషన్, రామేశ్వర రావు , గంగుల కమలాకర్ అక్రమ మైనింగ్ తదితరాలతో  ఎవరికి ఎంత ముట్టిందో సులభంగా తెలుస్తుందని 77 వేల జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు.  ఏడేళ్లల బడ్జెట్లలో అంచనా వ్యాల పెంపు ద్వారా వేల కోట్లు చేతులు మారాయి. కెవిపి రామచంద్రరావు, చిన్నజీయర్ స్వామి చేతికి మట్టి అంటకుండా కత నడిపిస్తున్నారు. సుమారు ఎనిమిది లక్షల కోట్ల ప్రజల సొమ్ము, వనరుల సొమ్ము  టి ఆర్ ఎస్, కెసిఆర్ పరివారం హస్తగతం చేసుకుంది. టీవీలను, పత్రికలను కొని, పెట్టుబడులు, లోపాయికారీ ఒప్పందాలతో. లైవ్ టెలికాస్టు విధానాలతో అవినీతిని కప్పి పెడుతున్నారు.  లక్ష యాభయి జీవో లలో సగం జీవోలను కనపడకుండా చేశారంటే అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో ఊహించవచ్చు. ప్రజలకు పప్పు బెల్లం పెట్టినట్టు ఆసరాపథకం, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రుణ మాఫీ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, దళిత బంధు, డబుల్ బెడ్ రూం , రేషన్ బియ్యం వంటి 

 పథకాలను ఆకాశం బద్దలయ్యేట్టు ప్రచారం చేస్తూ నయ వంచన చేస్తున్నారు. నయీం కూడ బెట్టిన సంపద కూడా రకరకాల రూపాల్లోకి. ార్చ బడుతున్నది. కెసిఆర్ పరివారం అవినీతి అక్రమాలు వింటుంటే తల తిరిగి పోతున్నది. ఇన్నిన్ని వేల కోట్లు ప్రజల ు ముంచి, ప్రభుత్వాలను అప్పుల పారు చేసి కూడ బెట్టి కన్ను మూసిన తరువాత ఒక పైసా కూ వెంటరాదు. అధిక అంచనాలు చూపి , ప్రభుత్వం పేరిట మూడు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. అందులో  పావు వంతైనా వీరి ఆస్తిగా మారుతున్నది. ప్రజల పేరిట చేసిన ఈ అప్పులు తీర్చడానికి కనీసం. ుప్పయి 

ఏండ్లు పడుతున్నది.  ఇలా ఆరేండ్ల అవినీతి కోసం ముప్పయి ఏండ్ల పాటు ప్రజలు అప్పుల పాలవుతున్నారు.  నిరంతరం ఏది ఎట్లా తరలించాలనే ధ్యాస. ప్రజలను కలువక, సచివాలయం రాక ఫాం హౌజ్ లో పన్నాగాలు పన్నడం, సంపాదించిన కొద్దీ  అభద్రతా భయం, పరిపాలనా సామర్థ్యం కొరవడి పాలన చతికిల పడుతున్నది.   ప్రజలు వరదలతో, ఆక్సిడెండ్లతో , కౌలు దారులకు రైతు బంధు లేక ఆత్మ హత్యలు జరిగి పోతుంటే వారికి ఒక ఆట లా వినోదం చూస్తున్నారు. ఈటల కోరినట్టు ఈ ఇరవై ఏళ్లలో ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో, ఎంత పెరిగాయో

 నిర్దారణ చేయడం అవసరం. రైతు బంధుతో, రైతు రుణ మాఫీతో  కెసీఆర్ కులస్థులు, రెడ్లు, ధనిక సంపన్న రైతులు లక్షల రూపాయలు అయాచితంగా పొందుతున్నారు. 

        మభ్య పెట్టి మాట్లాడడం అనే కళతో ఎంత సంపాదిస్తున్నారో  ఊహ కందదు.  ఇవన్నీ చూస్తుంటే యూరపు లోని రువాండా అవినీతి గుట్టల చెప్పులు గుర్తుకు వస్తున్నాయి. 

 తెలంగాణలో చైతన్యం, ఉద్యమాలు ఎక్కువని చెప్పుకుంటారు. నిజంగానే చైతవ్యం ఉందా? ఉంటే ఈ అవినీతి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా కలాలు గళాలు ఏవీ? పంజాబ్ రైతులు కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సమ్మె ు బలిదానాలు చేస్తుంటే కనీసం.  ద నాగళ్లతోనైనా కదల లేదు.

రాజకీయ పార్టీలూ  ముందుండి కదిలించ లేక పోయాయి.  

ఇట్లయితే ఈ సమాజం ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా ఈ ప్రజలు బాగు పడుతారు?

కెసి ఆర్ హఠావో తెలంగాణ బచావో.

 

BS Ramulu, Ex.BC Commission Chairman

 బి ఎస్ రాములు  8331966987

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV