తెలంగాణ కోసం అల్లూరి కొట్లాట,
04 Jun 2022 తెలంగాణ 320

ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారీ అంతకుమించి దిగజారుతున్నరు బీజేపీ నేతలు. తెలంగాణ ఉద్యమం కోసం మన్యం వీరుడు అల్లూరి పోరాడిండట. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొత్త విషయాన్ని కనిపెట్టారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఈ కొత్త హీరోను పరిచయం చేశాడు. నమ్మట్లేదా అయితే ఈ వీడియో చూడండి.

(అమిత్ షా నోట అల్లూరి మాట)

 

రీసెంట్ గా RRR సినిమా రిలీజైంది కదా. రాజమౌళి అనే ఓ సినీ వ్యాపారి, కాసుల కక్కుర్తి తప్ప ఇంకేమీ తెలియని అర్థజ్ఞాని చేసిన ప్రయోగం స్క్రీన్ ని ఉర్రూతలూగించింది. చరిత్రను వక్రీకరించి తీసిన ఆ సినిమా వందల కోట్లు వసూళ్లు చేసింది. దానికి రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు, నేతలు కలిసి ఇతోధికంగా తమ వంతు సాయం చేశారు. అది వేరే టాపిక్. మే బీ దాన్ని పట్టుకునే అమిత్ షా అల్లూరి తెలంగాణ కోసం కొట్లాడిండని చెప్పి ఉండొచ్చు. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇదే మరి. 

 

వక్రీకరణలు, వక్రభాష్యాలతో రోజూ వందల పోస్టులను పుట్టించే బీజేపీ సోషల్ మీడియా కుట్రల్ని తిప్పికొట్టలేక ప్రతిపక్షాలు అల్లాడుతున్నాయి. అలాంటిది అల్లూరి తెలంగాణ కోసం కొట్లాడిండని అమిత్ షా చెప్పడంతో జనం డంగైపోయారు మరి. అసలా స్పీచ్ రాసిచ్చినోడెవడు ? రాసిచ్చినా క్రాస్ చెక్ చేసుకోకుండా అమిత్ షా చదివేడమేంది ? అసలీయనెట్ల హోం మంత్రైండు ? అసలు దేనికోసం ఆ వక్రీకరణ అన్న చర్చ జరుగుతుండగానే... అమిత్ షా మాటను నిజం చేసేందుకు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ తెలంగాణకు-అల్లూరికి లింకు కలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.

(మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు) 

 

సినిమాలవాళ్లు చరిత్ర రాసే పనికి పూనుకున్నారు. "కశ్మీర్ ఫైల్స్" ను మోడీ ప్రభుత్వమే ప్రచారం చేసే బాధ్యతలు తీసుకున్నచోట... కొత్త చరిత్రకారులు పుట్టుకొస్తూనే వున్నారు. కొత్త చరిత్రలు పుడూతేనే ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో చరిత్ర పేజీలని ఎప్పుడో చించేసి వాటి మధ్య కొత్త కొత్త హీరోలతో చరిత్ర పేజీలని కుడుతున్న చోట అమిత్ షా అల్లూరి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడటం కొత్తేం కాదు. అసలు చదువే రానప్పుడు తెలిసిన ప్రతీదీ చదువే, వాళ్లకు లాభం తెచ్చిపెట్టే ప్రతీదీ సరుకే. అజ్ఞానం రాజ్యమేలుతున్న చోట ఇలాంటి కొత్త భాష్యాలు చెప్పే పాలకులు దొరకడం మన దౌర్భాగ్యం. ఈ దేశాన్ని ఇక ఆ దేవుడే కాపాడాలి. అన్నట్టు సోషల్ మీడియాలో అమిత్ షా మాటలపై విపరీతంగా మీమ్స్-పోస్టులు వైరల్ అయితున్నై. అందులో ఇది పీక్స్ అన్నట్టు.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV