ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. తుది పోరులో సిట్సిపాస్‌పై 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయంసాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండుసెట్లను గెలిచి కెరీర్‌లో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుందామనుకున్న ఐదో సీడ్ సిట్సిపాస్ ఆశలను వమ్ము చేస్తూ వరుస సెట్లలో జకోవిచ్ చెలరేగిపోయాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్రెజికోవా - సినియాకోవా జోడీ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో క్రెజికోవా - సినియాకోవా జంట 6-4, 6-2 తేడాతో స్వైతెక్ - సాండ్స్‌పై గెలుపొందారు. నిన్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను క్రెజికోవా గెలుచుకున్న విషయం తెలిసిందే. సింగిల్స్ విజేత డబుల్స్‌లోనూ గెలవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం!