సెప్టెంబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ : కేసీఆర్ షాకింగ్ డెసిషన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2న జెండా పండుగ కార్యక్రమాలు ఉంటాయని, అదే రోజున ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభించే కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారని పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరులోపు గ్రామ ,మండల ,జిల్లా ,రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీలు, పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గం ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీలన్నీ సెప్టెంబర్ చివరి వరకు పూర్తవుతాయి అని కేటీఆర్ వివరించారు. కాగా,హైదరాబాద్ లో 150 డివిజన్ల కు 150 డివిజన్ కమిటీలు ఉంటాయన్నారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 51 శాతం పైగా అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాకు సంబంధించి కమిటీలు వేయాలని నిర్ణయించాం. మండల, పట్టణ, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.