బగ్ కనిపెట్టిండు...
జాక్ పాట్ కొట్టిండు...
సోషల్ మీడియా ఆప్ ఇంస్టాగ్రామ్ లో ఉన్న బగ్ ని కనిపెట్టి మన దేశానికి చెందిన యువకుడు 22 లక్షల జాక్ పాట్ కొట్టిండు.
సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లోనే హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు. మరికొందరు మాత్రం ఎల్లవేలా ఇదే పనిలో నిమగ్నమై బగ్స్‌ను కనుగొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బగ్‌ను గుర్తించిన మనదేశానికి చెందిన ఓ ఎథికల్ హకర్‌కు ఏకంగా రూ. 22 లక్షల జాక్‌పాట్ కొట్టాడు.
ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో ఇన్ఫర్మేషన్ అంతా సోషల్ మీడియా యాప్‌లతోనే నడుస్తోంది. అందుకే చాలా మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలను వాడుతూ బిజీగా కాలం గడుపు తున్నారు. సోషల్ మీడియా యాప్స్‌లో అకౌంట్ లేని వారు ప్రస్తుతం చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. అయితే ఇలాంటి యాప్స్‌లో ప్రైవసీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అప్పుడప్పుడు కొన్ని లోపాలు బయట పడుతూనే ఉంటాయి. ఇటీవల ఇలాంటి ఓ లోపమే ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికి పట్టుకున్నాడు ముంబయికి చెందిన మయూర్ ఫార్టేడ్ అనే యువకుడు. దీంతో సదరు కంపెనీకి దాని వివరాలు అందించడంతో… ఫేస్‌బుక్ సంబంధింత బగ్‌ను నిర్ధారించుకుని సుమారు రూ.22 లక్షలను మయూర్‌కు అందించింది ఇంస్టాగ్రామ్. ఈమేరకు ఫేస్‌బుక్ నుంచి వచ్చిన మేసేజ్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశాడు ఈ కుర్రాడు.