భారీ వేతనాన్ని వదులుకున్న సీఈఓ
07 Mar 2021 బిజినెస్ 638

బోయింగ్ సీఈవో డేవ్ కాల్‌హౌన్ 2020 సంవత్సరానికి సంబంధించిన భారీ వేతనంతోపాటు బోనస్‌ను వదులుకున్నారు. కరోనా నేపధ్యంలో... కిందటి సంవత్సరం విమాన సేవలు చాలాకాలం పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో... విమానయానరంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో... బోయింగ్ సంస్థకు గతేడాది ఏకంగా 12  బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో... కంపెనీ సీఈవో గతేడాదికి గాను పనితీరు ఆధారంగా ఇచ్చే బోనస్‌తోపాటు వేతనాన్ని కూడా వదులుకున్నారు. అయితే షేర్ల ప్రయోజనాల (స్టాక్ ఆప్షన్) రూపంలో వచ్చే 21 మిలియన్ డాలర్లను మాత్రం అందుకున్నారు.

రెండు 737 మ్యాక్స్ ప్లేన్స్ ప్రమాదానికి కారణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా నేపధ్యంలో విమానాలకు డిమాండ్ తగ్గింది. దీంతో బోయింగ్ ఇబ్బందులనెదుర్కొంటోంది. కిందటి సంవత్సరం (2020) 12 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. డేవ్ కాల్‌హౌన్ 2020 జనవరిలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. మార్చిలో వేతన నిరాకరణ నిర్ణయానికి ముందు సమయంలో 2,69,231 డాలర్ల వేతనం వచ్చింది.ఇప్పుడు ఆయన 3.6 మిలియన్ డాలర్ల సాలరీని, ప్రోత్సాహాన్ని కూడా వదులుకున్నారు.

అయతే మ్యాక్స్ విమానాల సర్వీసులను పునఃప్రారంభమయ్యేలా చేసినందుకు ఏడు మిలియన్ డాలర్లు, బ్లాక్ స్టోన్స్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టిందుకు 10 మిలియన్ డాలర్లు, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల కింద 3.5 మిలియన్ డాలర్ల మేర షేర్ల ప్రయోజనాలు లభించాయి. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ షేర్ల ప్రయోజనాలు ఆయనకు అందుతాయి.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV