కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన వినోద్ కుమార్
పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తాలి
టీ.ఆర్.ఎస్. ఎంపీలకు సూచించిన బోయినపల్లి వినోద్ కుమార్
కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ప్రతినిధుల విజ్ఞప్తిపై స్పందించిన వినోద్ కుమార్
కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. తమ డిమాండ్ కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కోరిన కమిటీ ప్రతినిధులు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలన్న కమిటీ ప్రతినిధుల డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు.
ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీ.ఆర్.ఎస్. పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు.
దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని ఆయన అన్నారు.
కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో " చలో ఢిల్లీ " వాల్ పోస్టర్ ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, నాయకులు స్వామి, నర్సింహులు, ఆశీర్వాదం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.