కేసీఆర్ పోటీ చేస్తా ? ప్రతిపక్షాలకు మల్లన్న చేసింది సవాలా ? రెక్వెస్టా ?
04 Jun 2022 తెలంగాణ 336

విన్నరు కదా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాను పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న సవాల్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిందీ ఇష్యూ. కేసీఆర్-తీన్మార్ మల్లన్న పోటీ రియాలిటీలోకొస్తే... నిజంగా సంచలనమే అవుతుంది. అది సాక్ష్యాత్కారం కావాలని కోరుకుందాం. 

 

ఇవన్నీ పక్కనపెడితే... కేసీఆర్ పై పోటీకి మల్లన్న సిద్ధమైండన్నది క్లియర్ అనుకుందం. కానీ ప్రతిపక్షాలనూ ఆ రింగులోకి దింపడంలో ఏమైనా వ్యూహముందా అన్నదే ఇపుడు సందేహం. అంతా కలిసి కొట్టుకుంటే అల్టిమేట్ గా కేసీఆర్ కే ఫాయిదా. ఇది తెలియనిది కాదు. అదే అందరూ కలిసి కేసీఆర్ పై మల్లన్నను పోటీకి దింపితే.. కేసీఆర్ ఆటలు సాగవన్నదీ నిజం. కానీ జరుగుతుందా ? 

 

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయాడు మల్లన్న. అప్పట్లో కాంగ్రెస్ నేతలే సపోర్ట్ చేయలేదు. హుజూరాబాద్ బై పోల్లో పోటీ చేసినప్పుడు ఒంటరిగా పోటీ చేశాడు. డిపాజిట్ కూడా దక్కలేదు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీజేపీ మద్ధతిచ్చిందన్న వాదన ఉంది. అందుకే కోదండరామ్ ని సైతం వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు మల్లన్న. 

 

ఇదంతా గుర్తించే అంతా కలిసి తనకు మద్ధతివ్వమని అభ్యర్థించాడా ? ప్రతిపక్షాలకు మల్లన్న కార్నర్ చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టసభలకు వెళ్లాలన్నది తన కల. మల్లన్నకు అసెంబ్లీ సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్నది కేసీఆర్ పంతం అయి ఉండొచ్చు. అందుకే అంతా కలిసి తనకు మద్ధతిస్తే కేసీఆర్ నే బొందపెడతా అన్న అర్థంలో ఈ సవాల్ చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రతిపక్షాల్లో ఆ ఐక్యతే ఉంటే.. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉండేదా ? ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్లవి. వాటిని దాటుకుని ప్రతిపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థికి మద్ధతివ్వడం అనేది చాలా అరుదు. అఫ్ కోర్స్.. తెలంగాణలో ప్రతిపక్షాలన్నవి లేకుండా చేసే కుట్రకు తెరతీసిండు కేసీఆర్. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇష్టానుసారం వ్యవహరించిండు. ఇపుడు అందరూ ఏకమై ఒక్కడ్ని ఓడించడం తప్పేం కాదన్నది జనం అభిప్రాయం. మల్లన్న అప్పీల్ కు ప్రతిపక్షాలు ఓకే అంటాయో... లేక ఎప్పట్లాగే రాజకీయ రొడ్డ కొట్టుడులో కొట్టుకుపోతాయో చూద్దాం.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV