తీన్మార్ మల్లన్న తెలంగాణ సెన్సేషన్. జర్నలిజంలో వినూత్న పోకడలకు తెరలేపి.. ముందు నుంచి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన పాత్రికేయ సంచలనం. కేసీఆర్ డిక్టేటర్ షిప్ నడుస్తున్న టైంలో... ప్రశ్న పేరుతో తెలంగాణ ప్రజలకు ఆయన మోసాల్ని/జిమ్మిక్కులను కళ్లకు కట్టినట్టు చూపించిన న్యూస్ ప్రజెంటర్. ఎవరు ఔనన్నా కాదన్న మల్లన్న ప్రశ్నల పరంపర తర్వాతే ప్రతిపక్షాలు లైన్లోకొచ్చాయి. అది వేరే విషయం. అప్పట్నించి కొనసాగిన ప్రశ్నల దాడి కేసీఆర్ అజేయుడు కాదు... అనామకుడే అని నిరూపించే దాకా కొనసాగింది.
ఇకపోతే జర్నలిస్ట్ కమ్ పొలిటిషియన్ అయిన తీన్మార్ మల్లన్న లెటెస్ట్ గా ఓ సంచలనానికి తెరలేపిండు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఏడ పోటీ చేస్తే ఆడ పోటీ చేస్త అని సవాల్ చేసిండు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సైతం కేసీఆర్ మీదనే పోటీ చేయ్యాలని సవాల్ విసిరిండు. ప్రజలు ఎవర్నో ఒక్కర్నే గెలిపిస్తరు. ఎవరు గెలిస్తే వాళ్లే తోపు అన్నట్టు కవ్వించిండు. సోషల్ మీడియాలో ఇపుడా వీడియో వైరల్ గా మారింది.
(మల్లన్న సవాల్ వీడియో)
మల్లన్న సవాల్ వర్కవుట్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్తుంది. కానీ తీన్మార్ వేసిన దరువు మాత్రం అదుర్స్ అంటున్నరంతా. కేసీఆర్ మీద పోటీ గనక చేస్తే అదో సంచలనంగా మారే అవకాశముంది. సీఎం క్యాండిడేట్ పై పోటీ చేసి ఓడించిన వ్యక్తిగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్... 15 ఏళ్ల పాటు హస్తినను ఏలిన షీలా దీక్షిత్ ఓడించి కుర్చీ దూరం చేశాడు. పంజాబ్ లోనూ కెప్టెన్ అమరిందర్ సింగ్ మీద ఆప్ అభ్యర్థిని పెట్టి గెలిపించాడు. దాంతో కేజ్రీవాల్ పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ లా మారిపోయాడు.
తెలంగాణలో ఇపుడు మల్లన్న వంతు అన్నట్టు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఓసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మల్లన్న చట్టసభలను టచ్ చేయలేకపోయాడు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ నెక్ట్స్ ఎలెక్షన్స్ మాత్రం కేసీఆర్ కు అంత ఈజీగా ఉండకపోవచ్చు. కేసీఆర్ ను ఎవరికి వాళ్లుగా ఓడించడం కష్టం. ఇది అన్ని పార్టీలకు తెలిసిన వాస్తవం. కానీ అందరూ కలిసి మల్లన్నకు సహకరిస్తే మాత్రం కేసీఆర్ ను కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. దీని గురించి ప్రతిపక్షాలు ఆలోచించాలని నెటిజన్లు సైతం సలహాలిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.