రేవంత్ లేవనెత్తిన రెడ్డి రాజకీయం ఇపుడు తెలంగాణలో బర్నింగ్ టాపిక్. ఈ టాపిక్ తో ఒకడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్న కాంగ్రెస్ దూకుడుకు రేవంత్ రెడ్డి అనూహ్యంగా బ్రేకులేశాడు. రెడ్లు ఓట్లేస్తేనే పార్టీ అధికారంలోకొస్తదా ? రెడ్లేసే ఓట్లతోనే ముఖ్యమంత్రులైతరా ? అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. బీసీ-ఎస్సీ-ఎస్టీ వర్గాల నుంచి అనూహ్యమైన ఎదురుదాడి కాంగ్రెస్ పై జరుగుతోంది. రేవంత్ నోటి నుంచి వచ్చిన రెడ్లదే అధికారం, రెడ్లతోనే అధికారం అన్న మాట కాంగ్రెస్ ను గొయ్యి తీసి పాతిపెట్టబోతున్నదా అన్న చర్చ జరుగుతోంది.
కొంచెంతో లోతుల్లోకెళితే... చరిత్ర నుంచి రేవంత్ రెడ్డి.. రెడ్ల సత్తాను తవ్వి తీసి చెప్పే ప్రయత్నం చేసిండు. రెడ్డి సామంత రాజుల చేతుల్లో కాకతీయ ధీర వనిత రాణిరుద్రమ ఓడిందని... గోన గన్నారెడ్డి నుంచి రాణి రుద్రమ దాకా కాకతీయ రాజులకు కాపు కాసింది కాపులేనని రేవంత్ అభిభాషణ. రెడ్లను పక్కనపెట్టి పద్మ నాయకులను చేరదీయడంతో కాకతీయుల కళావైభవం మట్టిగొట్టుకుపోయిందని.. అట్లుంటది రెడ్లతోని అని చరిత్ర చెప్పుకొచ్చాడు రేవంత్. బావుంది. నాటి చరిత్ర ఎంత మందికి గుర్తుందో తెల్వదు గనీ.. రేవంత్ చెప్పిన చరిత్రతో తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రలో కలిసిపోయేలా ఉందన్న టెన్షన్ కాంగ్రెస్ నేతల్లోనే కనిపిస్తోంది.
రెడ్ల చేతుల్లో పెడితేనే ఏ పార్టీకైనా అధికారం అని రేవంత్ చెప్పడం కాంగ్రెస్ లోనే కాదు ఇతర పార్టీల్లోని మిగతా వర్గాలను ఆలోచనలో పడేసింది. దీని మీద కాంగ్రెస్ వైఖరేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మిగతా కాంగ్రెస్ నేతలెవరూ నోరిప్పట్లేని దుస్థితి. జగ్గారెడ్డి నాకు సంబంధం లేదనేశాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్లు నో కామెంట్ అనేశారు. మిగతా కీలక నేతలెవరూ దీనిపై మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. వీహెచ్ లాంటి బీసీ లీడర్లను రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు తయారయ్యారు.
ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది. మంచో చెడో రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఆ పార్టీ దూకుడు నేర్చింది. రాహుల్ రాకతో... వరంగల్ డిక్లరేషన్ తో రేసులోకొచ్చింది. ప్రస్తుతం సర్వేలన్నీ కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందని చెబుతున్నాయి. ఇలాంటి స్థితిలో రేవంత్ చేసిన ఓ వేగ్ కామెంట్.... ఇపుడా పార్టీ చరిత్రను మార్చబోతుందా అన్న చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఇట్లనే మా బ్లడ్డు వేరు.. మా బ్రీడ్ వేరు.. అంటూ విర్రవీగిన కమ్మ కులాన్ని అన్ని వర్గాలు ఈసడించుకున్నాయి. కమ్మ బలుపుతో వచ్చిన నేతలను గొయ్యి తీసి పాతేశారు ఆ రాష్ట్ర ప్రజలు. కమ్మ పేరు వినిపిస్తేనే వాంతొచ్చేలా విర్రవీగారు ఆ కులం నేతలు. సేమ్ రేవంత్ కూడా అలాగే విర్రవీగుతున్నాడా ? రెడ్డి కులాన్ని, రెడ్డి నాయకులను మిగతా సామాజిక వర్గాలు ఈసడించుకునే స్థితికి తీసుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది. చూడాలి మరి ఈ నోటి దురుసు కాస్ట్ మూల్యమెంతో ?