హోం మంత్రి రాజీనామాకు వెల్లువెత్తుతున్న డిమాండ్లు
07 Jun 2022 తెలంగాణ 340

దిశ కేసు తర్వాత మరోసారి అంత పెద్ద ఎత్తున తెలంగాణ అట్టుడుకుతోంది. జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయలేదెందుకన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్ ముట్టడికి ప్రయత్నించిన యువతపైకి కుక్కలను ఉసిగొల్పిన పోలీసుల దుర్మార్గం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరోవైపు అసలు దోషులను పక్కకు తప్పించి కొసరు నిందితులను బలి చేస్తున్నరన్న ఆరోపణలొస్తున్నయ్. 

 

ఇవన్నీ పక్కనపెడితే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన హోం మంత్రి మహమూద్ అలీ ఏం చేస్తున్నట్టు. జూబ్లీహిల్స్ రేప్ కేసులో స్వయంగా తన మనవడే నిందితుడు అని మీడియా కోడై కూస్తోంది. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ పుత్రరత్నంతో సహా నిందితులంతా పలుకుబడి ఉన్నొళ్లే. దాంతో దర్యాప్తు నిష్ఫక్షపాతంగా జరుగుతుందా ? నిందితులకు శిక్ష పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

ఇకపోతే రోడ్లపై ఎక్కడికక్కడ పోలీసు పహారా జనాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఓ ఆడపిల్లకు న్యాయం చేయలేని వ్యవస్థ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి మహమూద్ అలీ నిజాయితీగా రాజీనామా చేయాలి. తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు, దర్యాప్తు పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ బాస్ పదవి నుంచి తప్పుకోవాలి. కానీ పెద్దాయన ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతుండటం జనంలో ఆగ్రహం తెప్పిస్తోంది.

 

గతంలో పుచ్చలపల్లి సుందరయ్యయ, బెజవాడ గోపాల రెడ్డి లాంటి వాళ్లు తమ శాఖలపై ఆరోపణలొస్తే... బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారన్నది చరిత్ర. అంత నిజాయితీ మహమూద్ అలీకి ఉందా అన్నదే డౌట్. నిజానికి రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి కన్నా హోం మంత్రే పెద్ద పదవి. అన్ని శాఖలకు సుప్రీం హోం శాఖ. అలాంటి శాఖలో ఉండి దర్యాప్తును నిక్కచ్ఛిగా జరిపిస్తారన్న గ్యారెంటీ ఎంటి ? పోలీస్ బాస్ గా కేసును పక్కదారి పట్టించరన్న గ్యారెంటీ ఏంటి ? అసలు హోం మంత్రిని మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ ఆదేశాలు జారీ చేస్తే తప్ప కేసు ముందుకు కదలకపోవడమేంటి ? హోం మంత్రిగా మహమూద్ అలీకి వెన్నెముక ఉన్నట్టా ? లేనట్టా ? అన్న అనుమానాల్ని ప్రతిపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి. 

ప్రతిపక్షాల విమర్శల కోసం కాకపోయినా... తన సచ్చీలత నిరూపించుకునేందుకైనా... దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేందుకైనా హోం మంత్రి రాజీనామా చేస్తే బావుండేది. మరి మహమూద్ అలీ రాజీనామా చేస్తారా ? అంటే ఆయన తీరు చూస్తుంటే అదేం జరిగేటట్టు కనిపించట్లేదు

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV