- చీకోటిని ఈడీ ఎందుకు టార్గెట్ చేసింది.. తెరవెనుక వాస్తవాలు చీకోటి చీకటి కోణాలు – 3
హాయ్ హలో.. నమస్తే. నేను మీ కేవీఆర్. చీకోటి ప్రవీణ్ కుమార్ చీకటి కోణాలు తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం షేకయ్యే సంచలనాలెన్నో ఆ కసినో డాన్ వెనుక దాగున్నాయని ముందు నుంచి చెప్తున్నాం. ఇపుడదే నిజమైంది. కేసీఆర్ ఢిల్లీ టూర్ రహస్యం ఏంటో తెలుసా ? ఈడీని కంట్రోల్ చెయ్యమని వేడుకునేందుకేనన్న రాజకీయ ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అసలు చీకోటి ప్రవీణ్ కుమార్ చీకటి కోణాల్లో కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఏంటి ? రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు-అవినీతి చిట్టాలు ప్రధాని టేబుల్ మీదున్నా... చీకోటినే దర్యాప్తు సంస్థలు ఎందుకు టార్గెట్ చేసినట్టు ? అన్నది తెలియాలంటే కొంచెం బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందే.
45 ఏళ్ల చీకోటి ప్రవీణ్ కుమార్ నిజానికి ఓ వ్యక్తి కాదు. ఓ శక్తి. అతనో బ్రాండ్. జనం ఎమోషన్స్ తో రాజకీయాలు చేస్తుంటారు నేతలు. వాళ్లకూ కొన్ని వీక్ నెస్ లుంటాయి కదా. అదే పత్తాలాట. జూదం ఆడే వీక్ నెస్. ఆ వీక్ నెస్సే చీకోటికి పెట్టుబడి. దాని ఆధారంగానే వేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించాడన్న వాదనలున్నాయి. చీకోటి చేతుల మీదుగా కొన్ని వేల కోట్ల హవాలా డబ్బు గాల్లో ఎగిరిందని... దేశం దాటెళ్లిపోయిందన్న షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ హవాలాలో తెలంగాణ కీలక నేతల హస్తం ఉందన్నది ఇపుడు హాట్ టాపిక్.
తెలంగాణలో పేకట ఇల్లీగల్. ఆడినట్టు, ఆడించినట్టు తెలిస్తే తాట తీస్తామని కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీస్కున్న తర్వాత వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే చిన్నా చితకా క్లబ్బులపై నిఘా పెరిగింది. సీఎం కేసీఆర్ నోటి వెంట ఓ సీరియస్ నోట్ వచ్చిందంటే... దానికి క్వైట్ అపోజిట్ గా మరోటి జరుగుతుందని ఈ ఎనిమిదేళ్లలో చాలాసార్లే రుజువైంది. పేకాట క్లబ్బులు తన రూపం మార్చుకుని కసినో రేంజ్ కి ఎదిగాయి. నిజానికి క్లబ్బులకూ, కసీనోలకు తెలంగాణలో పర్మిషన్ లేదు. దాంతో ఎందుకొచ్చిన గొడవ అని చాలామంది క్లబ్బులను మూసేసుకున్నారు. దాంతో జల్సారాయుళ్లకు ఎంటర్ టైన్ మెంట్ కరువైంది. వాళ్లందరికీ వన్ స్టాప్ సొల్యుషన్ బోర్డు చూపించాడు చీకోటి ప్రవీణ్ కుమార్. కసీనోతో పాటు అమ్మాయిలు, డ్రగ్స్, ట్రిప్స్ అంటూ ప్రతీ దానికీ ఓ రేటు కట్టి... ప్యాకేజీలు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
అలా మొదలుపెట్టిన దందాలో పొలిటిషియన్స్, ఐఏఎస్ లు, ఐపీఎస్ లతో సహా వీవీఐపీలెందరో చీకోటి క్లైంట్స్ గా మారిపోయారు. చీకోటి లిస్టులో తెలంగాణకు చెందిన ముగ్గురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు, ఆంధ్రాకు చెందిన ఓ మాజీ మంత్రి కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. తన కడ్తాల్ ఫామ్ హౌజ్ లో ఖరీదైన హై ఫై పార్టీలిచ్చే చీకోటి ట్రీట్ మెంట్ కు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందేనట. పిలిస్తే పలికే బాలీవుడ్-టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన పార్టీల్లో స్పెషల్ అట్రాక్షన్ అంట.
చీకటి సామ్రాజ్యం-అండర్ వరల్డ్ తో లింక్స్ ఉన్న చీకోటి హవాలా రాకెట్ కూడా నడిపిస్తాడన్న ఆరోపణలున్నాయి. తెలంగాణ కీలక నేతల రహస్యాలెన్నో చీకోటి లిస్టులో ఉన్నాయని అందుకే ఈ కసినో డాన్ ని కేంద్రం టార్గెట్ చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవును ఈడీ నోటీసులిచ్చింది. ఈడీకే సమాధానం చెప్తా... మీకెందుకు చెప్తా అని మీడియా ముందు జబర్ధస్తీ చేసిన చీకోటి ధైర్యం అదే. ఏకంగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత కూతురి హవాలా డబ్బు చీకోటి ద్వారా దేశం దాటెళ్లిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే ఇపుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు మంత్రులను తన కంట్రోల్లో పెట్టుకున్న పీసీని ప్రభుత్వమే కాపాడుతుందన్న విమర్శలు చేస్తున్నారు కొంతమంది.
2017లో ఫేమా యాక్ట్... ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద అరెస్టైనా.. రిలీజై దర్జాగా తిరుగుతుండటం వెనుక రహస్యమే అది. బడా నేతల అండదండలే అతన్ని కాపాడాయి. ఇపుడు అంతకు మించి ఏం జరగదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ-ఈడీ వేర్వేరు కాదని తెలిసిందే కదా. కేసీఆర్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేందుకే చీకోటిని టార్గెట్ చేసుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. చీకోటి చీకటి ఖాతాలన్నింటినీ గుప్పిట పెట్టుకుని కేసీఆర్ ని ఆడిస్తారన్న ఈ క్రైం-స్కాం థ్రిల్లర్ ని అబ్జర్వ్ చేసిన నిపుణులు చెప్తున్న మాట. చూడాలి మరి చీకోటి లింకుల డొంక ఎక్కడ తేలుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.