రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నడూ లేనంత బేలతనం. మస్త్ కన్ఫ్యూజన్. కంగారు పడుతూ... పార్టీని కంగారు పెడుతూ... ప్రభుత్వాన్ని గాలికొదిలేసిన తీరు తెలంగాణ కన్నార్పకుండా చూస్తోంది. కేసీఆర్ పాలనకు సంబంధించి ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోంది. సంక్షేమం పేరుతో రెండోసారి అధికారంలోకొచ్చిన కేసీఆర్... ఇపుడా కత్తికే బలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక అసలు విషయానికొస్తే... 2018లో ముందస్తుకు వెళ్లి గత సెంటిమెంటును బద్ధలు కొట్టి అఖండ మెజారిటీతో గెలిచాడు కేసీఆర్. దాంతో షేర్ ఖాన్, బాహుబలి అని ఎన్నెన్నో బిరుదులు. రెండోసారి అధికారంలోకొచ్చిన మూడేళ్ల తర్వాత అమాంతం దిగజారిపోయింది కేసీఆర్ గ్రాఫ్. ఆగిపోయిన రైతుబంధు, దెబ్బకొట్టబోతున్న దళితబంధు, 2 వేల పెన్షనిచ్చినా కుటుంబాల్లో రగిలిన చిచ్చు... కాళేశ్వరం తెల్లఏనుగులా మారిన తీరు... జీతాలిచ్చే దిక్కులేని స్థితికి చేరిన ఖజానా దుస్థితి. ఇట్ల చెప్పుకుంటూ పోతే... తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ విమర్శలెదుర్కొంటున్న అంశాలెన్నో.
ఇకపోతే గతంలో ముందస్తుకు వెళ్లి రికార్డ్ విజయాన్ని సాధించిన కేసీఆర్... ఈసారి అదే ట్రయల్ వేసేందుకు రెడీ అయినట్టు ఇప్పటికే ప్రతిపక్షాలు గ్రహించాయి. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా సై అంటున్నై. కేసీఆర్ మార్క్ జిమ్మిక్కులకు కాలం చెల్లిందని... గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతున్నై కాంగ్రెస్-బీజేపీ. ఓ వైపు ప్రతిపక్షాలు బలపడుతున్న తీరు కేసీఆర్ కు గుబులు పుట్టిస్తుంటే... ఆయన తనయుడు కేటీఆర్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత పెరగక ముందే ముందుస్తుకు వెళ్లి పని కానిచ్చేద్దాం అని మొండికి దిగుతున్నడట. అలా చేస్తే దెబ్బైపోతమ్ అని కేసీఆర్ వాదిస్తున్నడని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నై. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు... సిద్ధంగా ఉండండని కేటీఆర్ సంకేతాలిచ్చారు. అంతకుముందు కేసీఆరేమో.. పోయినసారంటే కొన్ని పనులు పెండింగ్ లో ఉండే అందుకే ముందుకుపోయినం. ఇపుడేం అవసరం. అని తేల్చేసిండు. ఈ లెక్కన ఎవరి మాట నమ్మాలి... ఎవర్ని ఫాలో కావాలి అని క్యాడర్ డైలమాలో పడిపోయిందట.
అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే... సగానికి పైగా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని పీకే సర్వే రిపోర్ట్ సారాంశం. సిట్టింగులకు సీట్లు గ్యారెంటీ ఇవ్వలేమని కేటీఆర్ స్పష్టంగా డైరెక్షన్ ఇవ్వడానికి అదే సంకేతం అని అంటున్నారు. సో గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయి. పీఠం కదులుతోందని పార్టీ అధినేత గ్రహించినట్టున్నరు. అందుకే భారత రాష్ట్ర సమితి పేరుతో జనాన్ని బురిడీ కొట్టించబోతున్నడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నై. చూడాలి మరి ఏం చేస్తరో... తండ్రీ కొడుకులిద్దరు కలిసి.