చీకోటి సామ్రాజ్యంలో మంత్రి హరీష్ రావు పాత్ర, చీకోటి చీకటి కోణాలు-6
హాయ్ నమస్తే... వెల్ కమ్ టు కాళోజీ టీవీ. చీకోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశాం. సంచలన నిజాలు బయటపెట్టాం. ఇది అంతకుమించి. పీసీ స్కాంలో కేవలం ఇద్దరు మంత్రుల పేర్లే మీడియా చూపిస్తోంది. వాడుతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి మల్లారెడ్డి. కానీ బయటకు రాని మూడో మంత్రి కూడా ఉన్నాడని తెలుసా ? ఆ మంత్రి వ్యవహారం గురించే ఈ వీడియో.
చీకోటి పత్తాలాట దందాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా పెద్దగా పట్టించుకోని ఓ పాత్రను అందరూ మర్చిపోయారు. ఆయనే చిట్టి దేవెందర్ రెడ్డి. మెదక్ డీసీసీబీ బ్యాంక్ ఛైర్మెన్. మంత్రి హరీష్ రావుకు ఆయన కుడిభుజం అన్నది మెదక్ నేతలు మాకిచ్చిన లీక్. అలాంటి చిట్టి దేవెందర్ రెడ్డి చీకోటి చీకటి సామ్రాజ్యంలో ఓ పార్ట్ నర్ అని తెలుస్తోంది. ఎంతసేపు చీకోటీ అతని నమ్మిన బంటు మాధవరెడ్డి గురించే మాట్లాడుతున్నరు తప్ప చిట్టి దేవెందర్ రెడ్డి పాత్ర ఎక్కడా బయటకొచ్చిన దాఖలాల్లేవు. కాళోజీ టీవీ ముందు నుంచి చెప్తున్నదదే. అసలు విషయాలు దాచి ఉద్దెర ముచ్చట్లు చెప్పడం, టాపిక్ డైవర్ట్ చేయడం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సోకైపోయింది.
చిట్టి దేవెందర్ రెడ్డి-చీకోటి ప్రవీణ్ ప్రైవేటు చాపర్ లో దిగుతున్న విజువల్స్ ని ఫస్ట్ చూపించింది కాళోజీ టీవీనే.
(చాపర్ విజువల్స్)
చీకోటి తన భుజాల మీద ఎక్కించుకుని డ్యాన్స్ చేసేంత చనువున్న వ్యక్తి చిట్టి దేవెందర్ రెడ్డి. ఓ రాజకీయ వేత్తగా బిజీగా ఉండే చిట్టి దేవెందర్ రెడ్డికి చీకోటితో ఏం పని మనం అడగొద్దు. రాజకీయాల్ని-ప్రజాసేవను పక్కనపెట్టి పీసీ ఎక్కడికెళితే అక్కడ ప్రత్యక్షమవుతుంటాడట. హరీష్ రావుకు చీకోటితో సన్నిహిత సంబంధాలున్నయో లేదో తెలీదు గానీ చిట్టి దేవెందర్ రెడ్డి అతనితో ఉన్న సాన్నిహిత్యం... ట్రబుల్ షూటర్ కి ట్రబుల్స్ తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అన్నట్టు ఈ స్కాంకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను తాను ప్రాతినిధ్యం వహించే ఓ ప్రభుత్వ బ్యాంకు లాకర్లో సీక్రెట్ గా దాచాడని సమాచారం. ఇప్పటికే చీకోటి-మాధవరెడ్డి వాళ్ల ఏజెంట్ల ఇళ్లను జల్లెడ పడుతున్న ఈడీ అధికారులు ఎప్పుడైనా మెదక్ లోని తన ఇంటిపై దాడి చెయ్యొచ్చన్న అనుమానంతో చాకచక్యంగా కీలక పత్రాలను దాచేశాడని తెలుస్తోంది.
(చిట్టి దేవెందర్ రెడ్డి డ్యాన్స్)
ఇంతకీ చీకోటి ప్రవీణ్ కుమార్ తో హరీష్ రావుకు సంబంధముందా లేదా ? ఈడీ రైడ్స్ తో కల్వకుంట్ల కుటుంబంలోని కీలక వ్యక్తులంతా జాడపత్తా లేకుండా పోయారు. రాష్ట్రంలో వరదలు అతలాకుతలం చేసినా యంత్రాంగం పట్టించుకునే దిక్కులేదు. కేటీఆర్ కాలు ఫ్రాక్చరై ఇంటికే పరిమితమయ్యారు. కవిత ఎక్కడున్నారో తెలీదు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ అడ్రస్ లేడు. కల్వకుంట్ల కుటుంబంలోని నాలుగు పవర్ సెంటర్స్ ఇట్ల గాయబ్ అయితే.. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న ఒకే ఒక్కడు హరీష్ రావు. తన పని తాను చేసుకుపోతున్నా... ఈడీ ఇచ్చిన షాక్ తో తన అనుచరుడు ఇరుక్కుపోవడం ఆయనకు పెద్ద దెబ్బే. చిట్టి దేవెందర్ రెడ్డిని లాక్ చేస్తే హరీష్ రావు పాత్ర ఏమైనా బయటకొస్తుందా ? లేక నిజంగానే చీకోటితో హరీష్ రావు సంబంధాలు లేవా ? అన్నది తేలాలంటే దర్యాప్తు ముందుకు సాగాలి. అసలు ఈ ఈడీ దాడులతో కేసీఆర్ ప్రభుత్వం చెల్లించుకోబోయే మూల్యమెంత అన్నది మరో వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.