పీసీని పట్టించిన బర్త్ డే పార్టీ, రూ. 5 కోట్లతో ఆడంబరం, చీకోటి చీకటి కోణాలు-5
03 Aug 2022 తెలంగాణ 400

 పీసీని పట్టించిన బర్త్ డే పార్టీ, రూ. 5 కోట్లతో ఆడంబరం, చీకోటి చీకటి కోణాలు-5

 

హాయ్ హలో... నమస్తే.. వెల్ కమ్ టు కాళోజీ టీవీ. 

 

(స్పాట్)

 

చూశారు కదా. పీసీ జబర్ధస్తీ. భారీ పూలదండలు, పూల వర్షం. బ్యాండ్ బాజా బరాత్ లు. డీజే డ్యాన్సులు. ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ చేసుకోవడం తప్పే కాదు. కానీ చీకోటీ చేసుకున్న బర్త్ డే పార్టీయే అతన్ని ఈడీ టార్గెట్ చేసేలా చేసింది. నమ్మడం లేదా. అదే నిజం. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కాస్ట్ సుమారు ఐదు కోట్లు. 

 

కింగ్ మేకర్లు, పవర్ బ్రోకర్లు, బిజినెస్ మెన్లు.. చాలా మంది ఈ బర్త్ డే పార్టీకి వచ్చారని సమాచారం. గత నెలలో సీక్రెట్ గా జరిగిన పీసీ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసుకుని హైదరాబాద్ లో దిగిపోయారని ఈడీకొచ్చిన సమాచారం. పీసీ బర్త్ డే వేడుకలను జంటనగరాలకు చెందిన ఇద్దరు మంత్రులు దగ్గరుండి చూసుకున్నారట. తెల్లవారు జాము వరకు గానా బజానాలతో ఎంజాయ్ చేసి... తాగి తందనాలాడిన ఒక్కొక్కరికి చివరి దాకా ఉండి సెండాఫ్ ఇచ్చారట. 

 

మంత్రులే దాసోహం అయి పీసీ బర్త్ డేను సెలబ్రేట్ చేయడమేంటని ఆరా తీస్తే... ఇదిగో ఈ డొంకంతా కదిలిందన్నట్టు. అక్కడి నుంచి మొదలైన ట్రేసింగ్... నేపాల్, ఇండోనేషియా, రష్యా, శ్రీలంకతో పాటు విదేశాల్లో ఎక్కడెక్కడ పీసీ-మాధవరెడ్డి కసినో ఆడించారో కనుక్కునే పనిలో పడ్డారట. ముఖ్యంగా పీసీ వాట్సాప్ చాట్ ద్వారా సిలిగురి కసినోకి సెలబ్రిటీలను ఎరవేసిన తీరు ఈడీ అధికారులకే షాకిచ్చినట్టు సమాచారం. 50 లక్షలు సమర్పించుకున్న వాళ్లకు ఖరీదైన ఫ్లైట్లో, 5 లక్షల వరకు చెల్లించిన వాళ్లకు సాధారణ ఫ్లైట్లలో నేపాల్ తరలించినట్టు తేలింది. దీనికితోడు పీసీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ప్రోమోతో ఎవరికి లింకులున్నాయో ఈజీగా తెలుసుకునేలా చేసింది.

 

పీసీ బర్త్ డే తెచ్చిన తంటాతో ఇపుడు బాలీవుడ్-టాలీవుడ్ ప్రముఖులతో పాటు బడాబాబులంతా బుక్కయ్యేలా కనిపిస్తోంది. పీసీ వాట్సాప్ చాట్ ద్వారా కూపీ లాగిన ఈడీ అధికారులు కొంతమంది హీరోయిన్లు, ముగ్గురు మంత్రులు, మరికొంతమంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపేందుకు రెడీ అయ్యారు. పీసీ తెచ్చిన తంటా ఇపుడు తెలంగాణ ప్రభుత్వాన్నే షేక్ చేస్తోంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రాన్ని కాకా పట్టే పనిలో ఉన్నారని తెలిసింది. కేసీఆర్ వైఖరి తెలిసిన కేంద్రం... రెడ్ సిగ్నల్ చూపించిందట. దాంతో ఎవర్నీ కలవకుండానే తిరుగుముఖం పట్టాడని రాజకీయ విమర్శలొస్తున్నాయి. ఇదీ పీసీ బర్త్ డే బిహైండ్ స్టోరీ. నెక్ట్స్ స్టోరీలో పీసీ స్కాంలో ఇద్దరు మంత్రులే బయటకొస్తున్నారు. బయటపడని మరో మంత్రి అనుచరుడి వ్యవహారంపై ఎక్స్ క్లూజివ్ స్టోరీతో మీ ముందుంటా. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV