చీకోటి ప్రవీణ్ చీకటి కోణాలు-1
02 Aug 2022 తెలంగాణ 326

 చీకోటి ప్రవీణ్ చీకటి కోణాలు-1

 

తెలంగాణ కీలక మంత్రులకు లింక్స్ 

 

ఈడీ దాడులు అందుకేనా ?

 

తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే ఘటన ఇది. రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అవి సంచలనంగా మారాయి. హైదరాబాద్ ఐఎస్ సదన్ కు చెందిన చికోటి ప్రవీణ్ కుమార్- బాలానగర్ కు చెందిన మాధవరెడ్డి.. వాళ్లిద్దరి ఏజెంట్లకు సంబంధించిన ఎనిమిది చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో దాడులు చేసింది. 

(స్పాట్)

 

 

అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్త ఇది. అదే చెప్తే కాళోజీ టీవీ స్పెషాలిటీ ఏముంటది ? ఈ ఈడీ దాడుల వెనుక చీకోటి ప్రవీణ్ కుమార్... చీకటి కోణాల గురించి తెలుసుకునే ముందు ఈ ఎక్స్ క్లూజివ్ వీడియో ఓ సారి చూడండి. ఏ ఛానెళ్లోనూ చూడరు. చూడలేరు. కాళోజీకి మాత్రమే దొరికిన ఎక్స్ క్లూజివ్ వీడియో ఇది. 

(స్పాట్)

 

గత నెల తేదీల్లో ఇండో-నేపాల్ బోర్డర్లోని సిలిగురిలో నిర్వహించిన కేసినోకు చీకోటి ప్రవీణ్ కుమార్ వెళ్తున్న వీడియో ఇది. ఈ వీడియోలో ఫస్ట్ దిగింది చీకోటి ప్రవీణ్ కుమార్. అతని వెనుక దిగింది మెదక్ డీసీసీబీ ఛైర్మెన్ చిట్టి దేవెందర్ రెడ్డి. ఆయన మంత్రి హరీష్ రావు ప్రధాన అనుచరుడు. మెదక్ జిల్లా రాజకీయాల్ని హరీష్ రావు శాసిస్తాడని అందరికీ తెలిసిందే. అలాంటి హరీష్ రావును శాసించేది చిట్టి దేవెందర్ రెడ్డి అన్న ప్రచారం ఉంది. చీకోటి ప్రవీణ్ తో కలిసి చిట్టి దేవెందర్ రెడ్డి ప్రైవేట్ జెట్ లో దిగడమే ఇక్కడ ట్విస్ట్. అసలు చీకోటి ప్రవీణ్ కు, చిట్టి దేవెందర్ రెడ్డికి-మాధవ రెడ్డికి ఉన్న లింకేంది అన్నదే ఇపుడు హాట్ టాపిక్.

(స్పాట్)

 

ఇక గతంలోకి వెళ్తే... 2017లో ఆంధ్రాలోని తాడేపల్లి గూడెంలో కేసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చీకోటి ప్రవీణ్ కుమార్. అప్పట్లో ఫేమా చట్టం కింద అరెస్టై జైలుకెళ్లాడు. బెయిల్ పై బయటకొచ్చాక... మకాం మార్చి శ్రీలంక బోర్డర్లో క్యాసినో నిర్వహించేవాడట. శ్రీలంక క్రైసిస్ నేపథ్యంలో అక్కడి నుంచి మకాం మార్చి ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని సిలిగురిలో కేసినో నిర్వహించినట్టు తేలింది. 

(స్పాట్)

 

కేసినో ఆడించడంలో చీకోటి చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానాల్లో కేసినో నిర్వహించే ప్రాంతాలకు ప్రముఖులను తీసుకెళ్లి... సకల వసతులు సమకూరుస్తాడట. గతంలో ఆంధ్రాలో విజయవాడ-తాడేపల్లి గూడెంలో కేసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చీకోటి ప్రవీణ్ కుమార్. 2017లో ఫేమా చట్టం కింద అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చి దేశం బయట కేసినో నిర్వహించడం మొదలుపెట్టాడట.

 

అమ్మాయిలు-బ్రోథల్స్-బార్ డాన్సర్స్-పోల్ డాన్సర్లతో కేసినో నిర్వహిస్తూ కోట్లు దండుకుంటాడని చీకోటి ప్రవీణ్ కుమార్ కు పేరుంది. అలాగే కీలకమైన తెలంగాణ మంత్రులకు సంబంధించిన హవాలా డబ్బును కంట్రోల్ చేసేది చీకోటి ప్రవీణేనని ఈడీ అనుమానిస్తోంది. తెలంగాణ కీలక మంత్రులపై నిఘా పెట్టిన నేపథ్యంలోనే... వాళ్ల మూలాల్ని దెబ్బకొట్టేందుకే చీకోటి ప్రవీణ్ కుమార్-మాధవరెడ్డిని ఈడీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్య మంత్రి హరీష్ రావు ప్రధాన అనుచరుడు చిట్టి దేవెందర్ రెడ్డి పేరు బయటకు రావడమే ఇపుడు సంచలనం.

 

బడాబాబులు-ప్రముఖ రాజకీయ నేతల పరిచయాలతో చీకోటి ప్రవీణ్ కుమార్ చెలరేగుతాడని మనకున్న సమాచారం. జూదంలో ఆరితేరిన హైదరాబాద్ కు చెందిన ఓ కీలక మంత్రితో చీకోటి ప్రవీణ్ కుమార్ కు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. పలు సందర్భాల్లో బహిరంగంగానే ఇద్దరూ కలిసి తిరిగిన వీడియోలున్నాయి. అలాగే మెదక్ జిల్లాకు చెందిన మరో కీలక మంత్రి ఆర్థిక మూలాలపైనా ఈడీ కన్నేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈడీ ఆకస్మిక దాడులు అన్న ప్రచారం జరుగుతోంది.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV