క్యాసినో డాన్... చీకోటి ప్రవీణ్ చీకటి కోణాలు 2
03 Aug 2022 తెలంగాణ 342

నమస్తే వెల్ కమ్ టు కాళోజీ టీవీ. నేను మీ కేవీఆర్. ఒక్క సారి పురాణాలు దాటొచ్చి చూడు...

అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలూ-విలన్ లూ లేరీ నాటకంలో... 

మనిషిలో లోతుగా కోరుకుపోయిన ధర్మం ఒక్కటే, అహం ! పాకే ప్రతి ప్రాణినీ కదిపే నిజం ఒక్కటే, ఆకలి ! పరితపించే ఆత్మనల్లా శాసించే శక్తొక్కటే, ఆశ! 

 

ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతీ నిజాయితీలు కొలిమిలో కొవ్వోత్తుల్లా కరిగిపోతాయి. ప్రస్థానం సినిమాలో సాయికుమార్ చెప్పే ఫేమస్ డైలాగ్ ఇది. ఇపుడిది ఎందుకు అనుకుంటున్నారా ? ఉంది లింకుంది. అది చెప్పేందుకే ఈ డైలాగ్.

 

 

చీకోటి ప్రవీణ్ కుమార్ ఎత్తిచూపే నిజస్వరూపాలన్నీ ఇపుడు గజగజ వణికిపోతున్నాయి. జూదం అధర్మం... అందులో డబ్బులు సంపాదించాలనుకోవడం మూర్ఖత్వం అని చెప్పే చీకోటి ప్రవీణ్ ఇంత లగ్జరీ లైఫ్ ఎలా సాధ్యమైంది. 

(రాజ్ న్యూస్ బైట్ 24 మినిట్స్ తో ఉంటది)

 

జూదం తప్పు. మహాభారతంలో ధర్మరాజే జూదానికి బలయ్యాడని చెప్పే పీసీ అదే చీకోటి ప్రవీణ్... అదే జూదాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని వందల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు సమాచారం. 

(స్పాట్)

 

ఓసారి డీటెయిల్స్ లోకి వెళ్దాం. చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ వాసి. రీసెంట్ గా 45 ఏళ్ల బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నడు. 2004 నుంచి అతని దందా స్టార్టైనట్టు తెలుస్తోంది. వైశ్య కమ్యూనిటీకి చెందిన చీకోటి... మొదట్లో ఓ కసినోలో టేబుల్ మేనేజర్ గా పనిచేశాడు. అందులో గుట్టుమట్లను తెలుసుకున్నాడు. పలు నేరాల్లో సూత్రధారి కూడా. సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఫైనాన్స్ ఇచ్చిన ఉదంతాలున్నాయి. చీకోటి ప్రవీణ్ స్వయంగా ఓ సినిమాలో నటించాడు కూడా. కోడి రామకృష్ణ డైరెక్టర్ గా వచ్చిన దొంగోడి పెళ్లి అనే సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ కూడా చేశాడు.

(దొంగోడి పెళ్లి సీన్)

 

అప్పట్నించే ఇండస్ట్రీతో రిలేషన్ మెయింటేన్ చేసిన చీకోటి... ఇండస్ట్రీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు నెరిపాడట. అందులో భాగంగానే నగరానికి చెందిన ఓ కీలక మంత్రికి చేరువయ్యాడు. కసినో డాన్ గా ఎదిగిన అతని క్లైంట్స్ లో తెలంగాణకు చెందిన ఓ కీలక మంత్రి, కొంతమంది ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మెన్లు రెగ్యులర్ క్లైంట్స్. తెలంగాణలోనే కాదు ఆంధ్రాకు చెందిన రాజకీయ  ప్రముఖులతోనూ సంబంధాలున్నాయట.

(స్పాట్)

 

కాళోజీ టీవీ కొంతమంది క్లోజ్ ఎయిడ్స్ ని ఆరా తీస్తే... ఎమ్మెల్యేలను అసలు దేకడట చీకోటి ప్రవీణ్ కుమార్. మంత్రుల లెవెల్ నుంచే అతని సంబంధాలుంటాయట. రాష్ట్రాలకతీతంగా ముఖ్యమంత్రులతోనూ సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం అతని స్టైల్. టాలీవుడ్-బాలీవుడ్ అన్న తేడా లేకుండా తను పిలిస్తే పలికే సినీ ప్రముఖులు చాలామందే. మల్లికా శరావత్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలైతే... తను పెంచుకునే ఊసరవెల్లులతో కబురు పంపినా వాలిపోతారట. 

(గోవా ముఖ్యమంత్రి నా ఫ్రెండే)

 

విదేశాల్లో అరుదుగా దొరికే వన్యప్రాణులను అదే ఎగ్జోటిక్ యానిమల్స్ ని తన కడ్తాల్ ఫామ్ హౌజ్ లో అపురూపంగా పెంచుకుంటాడు చీకోటి. మచ్చుకు ఈ వీడియో ఓ సారి చూడండి. తన జర్నీలో నాన్ వీనమస్ అంటే విషం లేని కొండ చిలువలతో గడిపేస్తుంటాడు. వాటిని తన ఇస్టాలో షేర్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోనూ చీకోటి యాక్టివ్ గా ఉండటం హైలైట్. 

(స్పాట్)

 

ఇవన్నీ పక్కన పెడితే.. 20 గంటల ఎంక్వైరీ తర్వాత చీకోటికి ఈడీ నోటీసులిచ్చింది. దానిపై క్లారిటీ కోసం అడిగితే మీడియా ముందు ఎంత జబర్ధస్తీగా ఆన్సరిచ్చాడో చూడండి.

(చీకోటి బైట్)

ఏంటి చీకోటి ధైర్యం. ఇంత ఇర్రెస్పిన్సాబిల్ గా ఆన్సర్ చేస్తున్నాడంటే... ఏంటి సంగతి అని ఆరా తీస్తే... కొన్ని సంచలన విషయాలు తెలిశాయి. వాటిని మరో వీడియోలో ఎక్స్ ప్లైయిన్ చేస్తా. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV