ఈ వ్యవస్థ చీకోటి వెంట్రుక కూడా పీకలేదు... ఎందుకంటే ? చీకోటి చీకటి కోణాలు-4
03 Aug 2022 తెలంగాణ 356

- ఈ వ్యవస్థ చీకోటి వెంట్రుక కూడా పీకలేదు... ఎందుకంటే ? చీకోటి చీకటి కోణాలు-4

 

హాయ్. నమస్తే. వెల్ కమ్ టు కాళోజీ టీవీ. నేను మీ కేవీఆర్. ఈ ప్రపంచం అమాయకులకు అందంగా కనపడుతుంది. కానీ క్రైం గురించి తెలిసిన వాళ్లకు మాత్రమే అందులోని చీకటి పరిచయమవుతుంది. ఈ ప్రపంచంలో మూడు రకాల మార్కెట్లుంటాయి. ఓపెన్ మార్కెట్, డీప్ మార్కెట్, డార్క్ మార్కెట్. 

 

ఓపెన్ మార్కెట్ అందరికీ కనిపించే వ్యవహారం. డీప్ మార్కెట్... దీని గురించి ట్రై చేస్తే ఎంతో కొంత తెలుసుకోవచ్చు. కానీ డార్క్ మార్కెట్ అలా కాదు. ఎంత ప్రయత్నించినా తెలుసుకోవడం చాలా కష్టం. ఒక దేశపు ఎకనమీ, పాలిటిక్స్ ని కంట్రోల్ చేసేది డార్క్ మార్కెటే. రీసెంట్ గా పునీత్ రాజ్ కుమార్ సినిమా జేమ్స్ డైలాగ్ ఇది. ఈ లైన్ గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం.

 

ఇపుడు మనం చెప్పుకోబోయేది డార్క్ మార్కెట్ గురించి. కింగ్ మేకర్స్, పవర్ బ్రోకర్స్ అండ్ బిగ్ బిజినెస్ మెన్స్ ఇందులో యాక్టివ్ గా ఉంటారు. వెపన్ ఇండస్ట్రీ, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, కసినో లాంటివన్నీ డార్క్ మార్కెట్ కిందకొస్తాయి. సో ఇందులో తెలియకుండా తలదూరిస్తే.. తలకాలయలు లేచిపోతాయి. అంత కర్కషంగా అణిచేస్తుంటుంది ఈ మాఫియా. 

 

ఇక అసలు విషయానికొస్తే చీకోటి చీకటి సామ్రాజ్యం ఇంచు మించు ఇలాంటిదే అన్న వాదనలున్నాయి. చీకోటి క్లైంట్స్ గా కింగ్ మేకర్స్, పవర్ బ్రోకర్స్, బిజినెస్ మెన్స్ చాలామంది ఉండటమే దీనికి ఉదాహరణ. ఇపుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. అదే ఈడీ చేస్తున్న దాడులతో కొన్ని బ్రేకింగ్ న్యూసులు, షాకింగ్ న్యూసులతో ఓ వారం పది రోజులు చర్చ జరగడం, వాటితో మీడియా డ్యాన్సులేయడం మినహా పెద్దగా ఒరిగేదేం లేదు. ఇది చాలాసార్లే రుజువైంది కూడా. అంత దాకా ఎందుకు ఇదే చీకోటి ప్రవీణ్ కుమార్ 2017లో ఫేమా యాక్ట్ కింద అరెస్టై జైలుకెళ్లాడు. దర్జాగా బయటకొచ్చి మళ్లీ దందా చేసుకున్నాడు.

 

నిజానికి చీకోటి ప్రవీణ్ కుమార్ దందాలో కనిపిస్తున్నది కసినో మాత్రమే. కానీ దాని వెనుక హవాలా రాకెట్ ఈడీకే కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. వేల కోట్ల హవాలా మనీ గాల్లోకెగిరిందని.. అవి ఎక్కడెక్కడికి వెళ్లి షెల్ కంపెనీల ద్వారా మళ్లీ తెలంగాణకు తిరిగొచ్చాయో ఆరా తీసేందుకే ఈ దాడులు అన్న చర్చ నడుస్తోంది. చీకోటిని లాక్ చేయడం ద్వారా తెలంగాణ పాలిటిక్స్ మొత్తాన్ని కంట్రోల్ చెయ్యొచ్చన్న ఓ గుడ్డి నమ్మకంతో బీజేపీ ఆడిన డెడ్లీ గేమ్ ఇదని అనుకుంటున్నారు. దీని పర్యవసనాలు ఏంటన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

 

ఇకపోతే చీకోటి నేర సామ్రాజ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీవీఐపీలతో మాత్రమే దోస్తీ చేసే చీకోటి.. తన బిజీ షెడ్యూల్ లో ఎగ్జోటిక్ యానిమల్స్ తో ఎంజాయ్ చేయడం చూస్తుంటే.. అంత డబ్బు ఎలా సాధ్యం అన్న డౌట్లొస్తున్నాయి. మంత్రులతో కలిసి పార్టీలు చేసుకునే రేంజులో ఉన్న చీకోటిని ఈ వ్యవస్థ వెంట్రుక కూడా పీకలేదన్న చర్చ జరుగుతోంది. అయినా అతిగొప్ప ప్రజాస్వామ్య దేశంలో... ఆర్థిక నేరాల్లో శిక్ష పడి కథ ముగిసిన క్యారెక్టర్లెన్నీ ? ఇదీ అలాంటిదే. పీసీ బయటపడ్డ ఓ ఎర మాత్రమే. కలుగులో దాక్కున్న చీకోటిలు చాలామందే. అవన్నీ దర్యాప్తు సంస్థలకు తెలియనివి కావు. అవసరానికి తగ్గట్టు బయటకొస్తుంటాయి. అంతే.

 

 

అసలు చీకోటి ప్రవీణ్... అదే పీసీని కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేయడానికి కారణమేంటి ? తాను చేసుకున్న బర్త్ డే పార్టీయే అతన్ని టార్గెట్ చేసింది. దానికి సంబంధించిన సంచలన నిజాలతో నెక్ట్స్ వీడియోలో కలుద్దాం. కీప్ ఇన్ టచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV