జీతాలిచ్చే దిక్కులేదు, ప్రచారానికి కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్
04 Jun 2022 తెలంగాణ 316

కన్నతల్లికి తిండి పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తనన్నడట. కేసీఆర్ వాడిన సామెతే. ఇపుడది ఆయనకే రివర్స్ కొడుతోంది. తెలంగాణ ఖజానా ఖాళీ అయింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు కుప్పగా తెలంగాణ మారింది. జీతాలిచ్చే దిక్కులేదు. సంక్షేమానికి పైసల్లేవు. పల్లె ప్రగతికి నిధుల్లేక సర్పంచులు రోడ్డెక్కిన పరిస్థితి. సింపుల్ గా చెప్పాలంటే సర్ ప్లస్ స్టేట్ తెలంగాణ ఇపుడు దివాళా తీసిన రాష్ట్రం. అదీ కేసీఆర్ పాలనలో. 

ఈ వాస్తవం ఇలా ఉంటే... దేశ్ కీ నేత అనిపించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు జనంలో ఆగ్రహావేశాల్ని పెంచుతున్నై. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు... ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచార డంభాచారం విస్తుపోయేలా చేస్తోంది.

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పత్రికా ప్రచారానికి కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పేపర్లలో యాడ్లు ప్రత్యక్షమయ్యాయి. పెద్దా-చిన్నా అన్న తేడా లేకుండా అన్నింట్లోనూ పబ్లిసిటీ చేసుకుంది గులాబీ పార్టీ. ట్యాబ్లాయిడ్లనూ వదల్లేదు. ఇంకా నయం ఇంటర్నేషనల్ పత్రికలకు ఇవ్వలేదు. బతికించారు పో అని అనుకుంటున్నరు జనం. 

కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి ఇచ్చిన ఆ యాడ్లతో ఎవరికి ఫాయిదా ? తెలంగాణ ప్రజల పరిస్థితి బాగుందా ? ఇంట గెలిచి రచ్చ గెలవాలంటరు కదా. రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యాన్ని పక్కనపెట్టి దేశవ్యాప్తంగా యాడ్లివ్వడమేందని జనం ఫైరైతున్నరు. దొర పాలనకు ఇది పరాకాష్ట అంటున్నరు. ఇంటున్నవా దొరా ?

Kalam - KALOJI TV
Galam - KALOJI TV
Telangana - KALOJI TV