కేసీఆర్ కు చెక్ మేట్ చెప్పిన మోడీ, చీకోటీ ఈడీ రైడ్స్ తో తెలంగాణలో జరిగేదేంటి ? చీకటి కోణాలు-7
హాయ్. నమస్తే వెల్ కమ్ టు కాళోజీ టీవీ. నేను మీ కేవీఆర్. రాజకీయం. రాక్షసంగా జనులకు కీడు చేసే యంత్రాంగం అని ఓ సినీ కవి చెప్పిన ఫుల్ ఫామ్. నిజంగానే సిస్టమ్ జనానికి కీడు చేసే యంత్రాంగంగా మారింది. ఇది ఫస్టూ కాదు... లాస్టూ కాదు. కానీ రాజకీయం చేసే కీలక నేతలతో సైతం అలాగే ఆడుకోవడం పాలటిక్స్ స్టైల్ అఫ్ ఫంక్షనింగ్. రాజకీయాలు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా కలిసి రాదు. ఒకసారి రాజైనోడు బంట్రోతుగా మారొచ్చు. బంట్రోతుగా ఉన్నోడు రాజూ అవ్వచ్చు. పులి మీద స్వారీ లాంటిది. అదే పొలిటికల్ బ్యూటీ. రాజ్యాంగం, వ్యవస్థలు కల్పించిన వెసులుబాటు అది.
ఈ ఉపోద్ఘాతాన్ని పక్కనపెడితే... ఓసారి గతంలోకి వెళ్దాం. చంద్రబాబును కరకట్టకు తరిమిన ఓటుకు నోటు కేసును ఓసారి గుర్తుకు చేసుకుందాం. రేవంత్ రెడ్డి చేసిన ఓ బ్లండర్ మిస్టేక్ కాస్ట్... చంద్రబాబు రాజకీయ జీవితం. తెలంగాణలో టీడీపీ నామరూపాల్లేకుండా చేసిన ఎపిసోడ్ అది. ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ పై హక్కులు కోల్పోయిన ఉదంతం అది. ఓటుకు నోటు కేసు గురించి ఇపుడు కొత్తగా చెప్పుకునేదేం లేదు. చంద్రబాబు పనైపోయింది కాబట్టి ఆ కేసు నుంచి బచాయించినట్టే. రేవంత్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నంత కాలం వెంటాడే కేసది.
ఇపుడు వర్తమానంలోకి వద్దాం. చీకోటి ప్రవీణ్ కుమార్ పై ఈడీ చేసిన దాడులు అంతా లైట్ తీసుకుంటున్నరు. కానీ దాని లోతుల్లోకి వెళ్తే తప్ప తత్వం బోధపడదు. బీజేపీ నేతలు పదే పదే కేసీఆర్ కు జైలు తప్పదు. చిప్పకూడు తినిపిస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్నా... కల్వకుంట్ల కుటుంబ అవినీతిని తవ్వే చర్యల్లో ఇంచు మందం ముందుకు కదల్లేదు. అదో ఒప్పందం అనుకుందం. మోడీ-కేసీఆర్ కి నడిచినంత కాలం సాగిందనే అనుకుందం.
కానీ చీకోటి స్కాం అలాంటిది కాదు. కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ దాకా... కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రతీ సంక్షేమ పథకంలో బొక్కలున్నై అని అందరికీ తెలుసు. ధరణి దరిద్రంతో తెలంగాణ నేతల మొత్తం అవినీతి బండారం బయటపడుతుంది. అవన్నీ వదిలేసి చీకోటినే ఎందుకు టార్గెట్ చేసినట్టు ? అంటే... చీకోటి క్లైంట్స్ లిస్ట్ లో తెలంగాణ కీలక నేతల హస్తం ఉంది. ఫెమా యాక్ట్, PMLA ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బుక్కయ్యే వాళ్లు చాలామంది. ఆ హవాలా రాకెట్ లో ఎవరెవరికి లింకులున్నాయో తెలుసుకునే చర్య అది. ఆ లిస్టును తవ్వి తీసేందుకే చీకోటిని లాక్ చేసారన్నది నిపుణుల విశ్లేషణ.
నిజానికి ఫేమా, PMLA చట్టాల తీవ్రత చాలా ఎక్కువ. పదునుగా వాడితే ఏ ఆర్థిక నేరగాడూ ఊపిరి కూడా తీసుకోలేని స్థితికి నెట్టేసేంత పవర్ ఫుల్ కేసులవి. రీసెంట్ గా ఈడీకీ పదునైన కోరలు సెట్ చేస్తూ బిల్లు తీసుకొచ్చింది కేంద్రం. దాంతో చీకోటి స్కాం ఎటు వైపుకు తీస్కెళ్తారన్న చర్చ మొదలైంది. చట్టంలోనూ బొక్కలుంటైగా. వాటిని అడ్డం పెట్టుకుని.. కేంద్రానికి సాగిలపడి అవసరానికి సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకెళ్తుంటరు కొందరు. అది చాలాసార్లు రుజువైంది కూడా. కాంగ్రెస్ హయాంలో మాయావతి-లాలూ ప్రసాద్ యాదవ్-శరద్ పవార్ లాంటి డైనమిక్ లీడర్లను సోనియా గాంధీ అలాగే గుప్పిట్లో పెట్టుకున్నారు. మోడీ-షా వచ్చిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఇష్టానుసారం వాడుతూ ప్రభుత్వాల్నే పడగొడుతున్న ఉదంతాలెన్నో చూశాం.
సేమ్ అలాగే.. ఇపుడు కేసీఆర్ ని తోక జాడించకుండా చేసేందుకే ఈ దాడులు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికొచ్చే కష్టం గానీ-నష్టం గానీ లేదనుకోండి. కానీ మాట్లాడితే దక్షిణ భారతదేశం, రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్నారు, దేశాన్ని మేమే సాదుతున్నం అని విరుచుకుపడే కేసీఆర్ కు ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోవచ్చన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. చావు అంచుల్లోకి వెళ్లి తెలంగాణను తెచ్చిన, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం రాజీపడే ప్రసక్తే లేదని చెప్పే కేసీఆర్ ఇకపై కేంద్రాన్ని తీవ్రస్థాయిలో డిమాండ్ చేసే అవకాశం కోల్పోయినట్టేనంటున్నారు. కేంద్రం మెడలు వంచుతం అన్న డైలాగ్ కేసీఆర్ నోట ఇక వినిపించకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవంగా చెప్పుకునే కేసీఆర్ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే. ఇది ముమ్మాటికి తెలంగాణకు జరిగిన అవమానం అన్నది కొందరి విశ్లేషణ.
(తెలంగాణ విట్టల్ బైట్)
ఇదీ కేసీఆర్ కు కేంద్రం చెక్ పెట్టిన తీరు. రాజకీయాలు డైనమిక్ అని కేసీఆర్ అన్నదే. తెలంగాణను క్యాప్చర్ చేసే వ్యూహంలో భాగంగా బీజేపీ వేసిన డైనమిక్ స్టెప్ ఇదేనేమో. దీని ఖరీదెంత అన్నది వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గానీ బయటపడదు. ఏక్ నాథ్ షిండే ఎవరో అప్పుడు తెలుస్తుంది. అధికార పార్టీ నుంచి గెలిచే ఎమ్మెల్యేలతో బేరసారాల్లేకుండా మరాఠా సీన్ తెలంగాణలో చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. మరో డైనమిక్ స్టోరీతో మళ్లీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాళోజీ టీవీ.