గల్ఫ్ భారతీయ రాయబారులతో సమావేశమైన మంత్రి
గల్ఫ్ భారతీయ రాయబారులతో సమావేశమైన మంత్రి
నిన్న గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఎఇ, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్ మరియు బహ్రెయిన్‌లలోని భారత రాయబారుల సమావేశానికి గౌరవనీయ దేశ విదేశాంగ మంత్రి డా.S.జై శంకర్ అధ్యక్షత వహించారు. గల్ఫ్ దేశాలకు త్వరలోనే విమానాలను పునరుద్ధరిస్తూ అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులను మాత్రదేశంలో ఉంటున్న వారి కుటుంబాలను కలుసుకునేలా చేస్తూ ఈ దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంతో ఈ సమావేశం నడిచినట్లు తెలుస్తోంది .. కువైట్ నగరంలో జరిగిన ఈ సమావేశానికి హాజరవ్వడం కోసం గురువారం పొద్దున్న జామునే అక్కడికి మంత్రి జైశంకర్ చేరుకున్నారు .. సౌదీ దేశాల్లో ఉంటున్న భారతీయుల యోగక్షేమాల గురించి తెలుసుకోవడమే కాకుండా, వారి అక్రమ వలసలు, దొంగ వీసాలు లాంటి పలు విషయాలు కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది..
కువైట్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అహ్మాద్ నాసిర్ తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య విద్య, వైద్యం, ఆహరం, వ్యాపారం , సహజవనరులు, ఆయిల్ లాంటి పలు అంశాల మీద క్రియాశీలకంగా కూలంకషంగా చర్చించడంతో పాటు అక్కడ పని చేస్తున్న భారత దెస కార్మికులకు సంబందించిన న్యాయపరమైన విషయాల పట్ల ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు ..
దృష్టి సారించిన చర్చలు :
1. ఆయా అధికార పరిధిలలో భారతీయ సమాజం యొక్క అత్యంత సంక్షేమానికి భరోసా.
2. కోవిడ్ మహమ్మారి వల్ల వేరుకాబడిన కుటుంబాల కలపడానికి వీలు కల్పించడం.
3. ప్రతిభ మరియు నైపుణ్యాలు కలిగి మహమ్మారి సమయంలో గల్ఫ్‌ను విడిచిపెట్టిన భారతీయులు తిరిగి రావడానికి మధ్యవర్తిత్వం వహించడం.
4. NRI లకు సహాయం చేయడానికి గల్ఫ్ గమ్యస్థానాలకు విమానాలను తిరిగి ప్రారంభించడాన్ని ప్రోత్సహించడం.
5.స్వదేశంలో ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడే వాణిజ్య ప్రయోజనాలను బలంగా ప్రోత్సహించడం